telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

మోడీ కేబినెట్ లోకి ..మరోసారి ఆ ఏపీ నేత..

4 directors arrested from sujana chowdary offices

కేంద్రం ఏపీ బీజేపీ నాయకత్వం నుండి ఎవరికీ ప్రాధాన్యత ఇస్తోందోననే ఆసక్తి సర్వత్రా నెలకొంది. భవిష్యత్తులో మోడీ కేబినెట్‌లో సుజనా చౌదరి, పురందేశ్వరిలలో ఎవరికి చోటు దక్కుతోందనే చర్చ సాగుతోంది. మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి టీడీపీ నుండి బీజేపీలో చేరారు. తనతో పాటు మరో ముగ్గురు రాజ్యసభ సభ సభ్యులను కూడ బీజేపీలో చేర్పించడంలో సుజనా చౌదరి కీలకంగా వ్యవహరించారు. విజయవాడ ఎంపీగా విజయం సాధించిన నాని బీజేపీలో చేరుతారని కూడ సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ ప్రచారాన్ని నాని ఖండిస్తున్నారు . టీడీపీకి చెందిన కీలక నేతలు బీజేపీ వైపు చూస్తున్నారనే ప్రచారం సాగుతోంది. కొందరు నేతలు ఈ ప్రచారాన్ని ఖండించారు. ఏపీలో టీడీపీని నిర్వీర్యం చేసేందుకు సుజనాచౌదరికి కీలకపదవిని ఇవ్వాలని బీజేపీ నాయకత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది . ఈ తరుణంలో సుజనా చౌదరి మోడీ కేబినెట్ లో చోటు దక్కవచ్చునన్న ఊహాగానాలు విన్పిస్తున్నాయి.

మోడీ కేబినెట్ లో సుజనా చౌదరి గతంలో పనిచేశారు. ఎన్డీఏలో టీడీపీ భాగస్వామిగా ఉన్న సమయంలో సుజనా చౌదరి టీడీపీ తరపున మోడీ కేబినెట్ లో చోటు దక్కించుకొన్నారు. ఏపీ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో అధికారం దక్కించుకొనే వ్యూహంతో బీజేపీ పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే బీజేపీ నాయకత్వం సుజనా చౌదరికి కీలకమైన పదవిని ఇచ్చే అవకాశాయలు ఉన్నాయన్న వాదనలు విన్పిస్తున్నాయి . సుజనా చౌదరికి కేంద్రమంత్రివర్గంలో చోటు కల్పిస్తే ఏపీలో టీడీపీ నేతలపై మరింతగా దృష్టి కేంద్రీకరించేందుకు అవకాశం ఉంటుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు . అయితే టీడీపీ నుండి చేరిన సుజనాకు వెంటనే మంత్రి పదవిని ఇస్తే తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది.

Related posts