telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

సుగాత్రీ!

sugatri poetry corner
విరుల పరిమళాల 
తరగల్లో వయ్యారానివే-
గాలి కెరటాలలో 
తరుల శాఖలగలగల లో 
ఇలకు దిగి వచ్చిన దేవకన్యవే
నా యెద కోయిలవే-
సుతిమెత్తని పాదాల
హంస నడకలో
మంజీర నాదానివే-
వెండి మబ్బు తునకవే –
వేకువ రవి కిరణానివే-
శుకమును సేదదీర్చి,
ప్రేమ పాఠాలు
వల్లించు శుభకారిణివే-
మది గగనంలో విరిసిన
ఇంద్రధనుస్సులో 
సప్తవర్ణాల శోభవే-
నాలో అణువణువు నీవే-
సుగాత్రీ!
నీ ప్రేమామృత సంగీత ఝరిలో
ఓలలాడు తున్నాను-
నీ వలపుల జల్లుల్లో
కరిగిపోతున్నాను-
-మహేంద్రాడ సింహాచలాచార్య, టెక్కలి 

Related posts