telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

ఎండాకాలంలో .. ఈ తియ్యటి పానీయం .. తప్పకుండ తాగండి.. !

ఎండాకాలంలో మనకు బాగా లభించే పానీయాలలో చెరకు రసం ఒకటి. ఇది తాగటం వలన కలిగే ప్రయోజనాలు అనేకం. వేసవిలో విరివిగా దొరికే చెరకు రసంతో దాహం తీరడమే కాదు శరీరానికి అవసరమైన పోషకాలు కూడా అందుతాయట. శక్తినిచ్చే ఈ వేసవి పానీయానికి ఆరోగ్యానికి మేలు చేసే గుణాలెన్నో ఉన్నాయంటున్నారు వైద్య నిపుణులు. చెరకు రసంలో సుక్రోజ్ రూపంలో ఉండే చక్కెరను శరీరం తేలికగా జీర్ణం చేసుకుంటుందట. కాబట్టి చెరకు రసం తాగగానే తక్షణ శక్తి చేకూరుతుందట. డీ హైడ్రేషన్ బారినపడినప్పుడు చెరకు రసం తాగితే త్వరగా కోలుకుంటారు.

* చెరకు రసంలోని ఫినాల్, ఫ్లేవనాల్, ఒంట్లోని ఫ్రీ ర్యాడికల్స్ ను పారద్రోలి కాలేయ వ్యాధులు, కామెర్ల నుంచి కాలేయానికి రక్షణ కల్పిస్తాయి.

sugarcane healthy in summer as drink* క్యాన్సర్ రాకుండా నియంత్రించే ప్లేవనాయిడ్స్ చెరకు రసంలో ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్ల క్యాన్సర్ కణాలు విస్తరించకుండా చేయడంతో పాటు వాటితో పోరాడి నాశనం చేస్తాయి.

* చెరకు రసం స్పోర్ట్స్ డ్రింక్ గా కూడా ఉపయోగపడుతుందట. ఆటల వల్ల వచ్చే అలసటను దూరం చేసే మెగ్నీషియం, పొటాషియం, ఫాస్పరస్ కాల్షియం ఎలక్ట్రొలైట్లు చెరకు రసంలో ఉంటాయి.

* చెరకు రసంలో గైసమిక్ ఇండెక్స్ చాలా తక్కువ కాబట్టి మధుమేహులు కూడా చెరకు రసం తాగొచ్చట. దీనిలోని సుక్రోజ్ దంతక్షయాన్ని కూడా నివారిస్తుంది.

Related posts