telugu navyamedia
సినిమా వార్తలు

మీరు న‌మ్మ‌గ‌ల‌రా… మల్టీస్టారర్ “వి” కోసం భారీ సంఖ్యలో కత్తులు

Sudheer-babu

నాని, సుధీర్ బాబు ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ చిత్రం “వి”. ప్ర‌స్తుతం ఈ చిత్రం బ్యాంకాక్‌లో షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఈ చిత్రంలో అదితిరావు హైద‌రి, నివేదా థామ‌స్ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. తాజాగా సుధీర్ బాబు త‌న ట్విట్ట‌ర్‌లో చిత్రానికి సంబంధించి అప్‌డేట్ ఇచ్చాడు. వివిధ ర‌కాల క‌త్తుల‌కి సంబంధించిన వీడియో షేర్ చేస్తూ “మీరు న‌మ్మ‌గ‌ల‌రా… ఇవి అన్ని కూడా ఇంద్ర‌గంటి సినిమా కోస‌మే. ఈ కళా ప్రక్రియను సులభంగా నిర్వహించడం అదే సమయంలో… వాటిని చెక్కుచెదరకుండా ఉంచడం గొప్ప విష‌యం” అంటూ సుధీర్ బాబు సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు.ఈ వీడియోలో బారి సంఖ్యలో ఉన్న కత్తులు ఒక పద్ధతిలో పేర్చబడి ఉన్నాయ్. ఈ వీడియో చూస్తుంటే సినిమాలో భారీ ఫైట్ ఉన్నట్టుగా అనిస్తుంది.

Related posts