telugu navyamedia
సినిమా వార్తలు

కారు యాక్సిడెంట్… “నువ్వు తోపురా” హీరోకు గాయాలు

Sudhakar-Komakula

ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో ఈరోజు ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా కారులో వెళుతున్న నటుడు సుధాకర్ కోమకులకు గాయాలు అయ్యాయి. హరీనాథ్ బాబు దర్శకత్వం వహించిన ‘నువ్వు తోపు రా’ అనే సినిమాలో సుధాకర్ నటిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే నెల 3న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్ కోసం హైదరాబాద్ నుంచి గుంటూరుకు వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మంగళగిరి మండలం చినకాకాని వద్ద ఈరోజు వేగంగా వెళుతున్న ఓ కారు.. జాతీయ రహదారిపై నీళ్లు పెడుతున్న మహిళను బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బాధితురాలు అక్కడికక్కడే చనిపోగా, కారు అదుపుతప్పి డివైడర్ ను బలంగా గుద్దుకుంది. ఈ ప్రమాదంపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related posts