telugu navyamedia
క్రైమ్ వార్తలు

బైక్‌పై వెళుతుండగా ఒక్క‌సారిగా మంటలు..

 హైదరాబాద్  మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని మౌలాలి ఫ్లైఓవర్ పై ద్విచక్ర వాహనంలో మంటలు వచ్చాయి. నడుస్తున్న బండిలో అకస్మాత్తుగా మంటలు రావడంతో ద్విచక్ర వాహనము నడుపుతున్న మహిళా కానిస్టేబుల్ కాలికి మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో మహిళా కానిస్టేబుల్ కాలికి తీవ్ర గాయాలు కావడంతో ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మహిళా కానిస్టేబుల్ కు చికిత్స జరుగుతుందని పోలీసులు తెలిపారు

ఈ సంఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. మల్కాజిగిరిలోని మౌలాలి ఫ్లై ఓవర్​వంతెనపై కానిస్టేబుల్ జ్యోష్ణ ద్విచక్రవాహనంపై వెళుతుండగా.. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ద్విచక్రవాహనం పూర్తిగా కాలిపోయింది. సమాచారం మేరకు అగ్నిమాపక దళం సిబ్బంది.. ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు.

Related posts