telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

చక్కెర మిల్లులకు .. కేంద్ర భారీ రాయితీలు..

subsidy sanctioned to sugar mills by central govt

కేంద్రం చెరకు రైతుల బకాయిలను తీర్చేందుకు చక్కెర మిల్లుల కోసం రూ.6,268 కోట్ల రాయితీని ప్రకటించింది. ఆరు మిలియన్ టన్నుల చక్కెర ఎగుమతి కోసం ఈ సబ్సిడీని క్యాబినెట్ అనుమతించింది. దీంతో అక్టోబర్‌తో మొదలయ్యే మార్కెటింగ్ సంవత్సరం (2019-20)కిగాను చక్కెర మిల్లుల్లో మిగిలిపోయిన చక్కెర నిల్వలను ఎగుమతి చేసేందుకు అవకాశం లభించినైట్లెంది. చెరకు రైతులకు చక్కెర కర్మాగారాలు దాదాపు రూ.15,000 కోట్లు బకాయిపడ్డాయి.

ఈ రాయితీ ప్రతిపాదనను ఆహార మంత్రిత్వ శాఖ తీసుకురాగా, ప్రధాని మోదీ నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాలపై క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) ఆమోదముద్ర వేసింది. టన్నుకు రూ.10,448 చొప్పున రాయితీని ఇవ్వనున్నట్లు క్యాబినెట్ సమావేశం అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ సమాచార, ప్రసారాల శాఖ మంత్రి ప్రకాశ్ జవడేకర్ చెప్పారు. చెరకు రైతుల ప్రయోజనార్థం ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. మా ఈ నిర్ణయం వల్ల ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటక తదితర చెరకు సాగు రాష్ర్టాల రైతులకు లాభమన్నారు.

Related posts