• Home
  • Trending Today
  • బాలీవుడ్ అగ్ర దర్శకుడిపై అత్యాచారం ఆరోపణలు
Trending Today సినిమా వార్తలు

బాలీవుడ్ అగ్ర దర్శకుడిపై అత్యాచారం ఆరోపణలు

Subhash Ghai

బాలీవుడ్ లో ప్రస్తుతం #మీటూ ఉద్యమ ప్రకంపనలు ఉధృతంగా మారాయి. లైంగిక వేధింపులకు పాల్పడిన బడా దర్శకులందరి పేర్లూ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. తాజాగా ప్రముఖ దర్శకుడు సుభాష్ పేరు కూడా బయటకు రావడంతో బిటౌన్ లో ఇది హాట్ టాపిక్ గా మారింది.

దర్శకుడు సుభాష్ ఘయ్ ఖల్‌నాయక్‌, రామ్‌ లఖాన్‌, పర్దేస్‌ వంటి సినిమాలతో బాలీవుడ్ లో దర్శకుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పేరు చెప్పుకోవడానికి ఇష్టపడని ఓ మహిళ సుభాష్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్క్రిప్ట్ డిస్కషన్ కోసమని సుభాష్ తనను ఆఫీస్ కి పిలిచారని, తరువాత కూల్ డ్రింక్ లో మత్తు మంది కలిపి స్పృహ కోల్పోయిన తనపై అత్యాచారం చేసినట్లు సదరు మహిళ ఆరోపిస్తోంది. ఈ విషయం గురించి బయటకు చెబితే జీతం డబ్బులు రాకుండా చేస్తానని సుభాష్ బెదిరించాడని, తన కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా జరిగిన ఘటన గురించి బయటకు చెప్పలేకపోయినట్లు ఆమె తెలిపారు.

దర్శకుడు సుభాష్ ఆమె ఆరోపణలపై స్పందించారు. తాను ఎవరిని ఇబ్బంది పెట్టలేదని, ఒకవేళ ఆమె చెప్పేది నిజమే అయితే కోర్టుకు వెళ్లి తేల్చుకోవాలని, లేదంటే పరువునష్టం దావా వేయాల్సి ఉంటుందని హెచ్చరిస్తూ ప్రముఖ స్థానంలో ఉన్న వ్యక్తులపై ఈ విధంగా ఆరోపణలు చేయడం అందరికి ఒక ఫ్యాషన్ గా మారిందని మండిపడ్డారు.

Related posts

మహర్షి తల్లిగా ప్రముఖ తార…!?

vimala t

ఇది నా సెల్ఫీ ఆడియో ఆవిష్క‌ర‌ణ‌

jithu j

సుశాంత్ 'చి ల సౌ' ఫస్ట్ లుక్..

admin

Leave a Comment