telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అల్లు అర్జున్ కుమారుడు అల్లు అయాన్ బర్త్ డే వెరీ సింపుల్

allu-ayan

లాక్‌డౌన్ కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. బేకరీలు, రెస్టారెంట్లు కూడా మూతబడ్డాయి. దీంతో పిల్లల పుట్టినరోజు వేడుకలకు దూరమవుతున్నారు. అమ్మానాన్నలతోనే ఇంట్లో సింపుల్‌గా పాయసం తాగి ఊరుకుంటున్నారు. కొంత మంది ఇంట్లోనే చిన్న కేక్ తయారుచేసుకుని పిల్లలతో కట్ చేయిస్తున్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ దంపతులు కూడా ఇలానే చేశారు. అల్లు అర్జున్ కుమారుడు అయాన్ పుట్టినరోజు నేడు. అయాన్ ఆరో ఏట అడుగుపెట్టాడు. కుమారుడు బర్త్‌డేను గ్రాండ్‌గా నిర్వహించే అవకాశం లేక ఇంట్లోనే చాలా సింపుల్‌గా చేశారు బన్నీ. ఇంట్లో చేసిన కేక్‌ను కొడుకుతో కట్ చేయించారు. ఈ ఫొటోలను అల్లు అర్జున్, అల్లు స్నేహారెడ్డి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. తన కుమారుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

 

View this post on Instagram

 

#happybirthday my baby #6 ❤️❤️❤️

A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) on

Related posts