telugu navyamedia
సినిమా వార్తలు

అమితాబ్ బచ్చన్ ఇంటి ఎదుట విద్యార్థుల ఆందోళన

Amitab

బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ ముంబై మెట్రో ప్రాజెక్టుకు మద్దతిస్తూ ట్వీట్ చేయడంపై విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. వివిధ పాఠశాలు, కాలేజీలకు చెందిన విద్యార్థులు సబర్బన్ జుహులోని అమితాబ్ బచ్చన్ నివాసం వద్దకు చేరుకున్నారు. మెట్రో ప్రాజెక్టు కార్ షెడ్ కోసం ఆరే కాలనీలో గ్రీన్ బెల్ట్‌గా ఉన్న 2700 చెట్లను తొలగించే నిర్ణయంపై..విద్యార్థి భారతీయ సంఘటన ఆధ్వర్యంలో సేవ్ ఆరే కాలనీ పేరుతో విద్యార్థులు ప్లకార్డులు, బ్యానర్లతో నినాదాలు చేస్తూ అమితాబ్ బచ్చన్ ఇంటి ఎదుట శాంతియుతంగా నిరసన చేపట్టారని జుహు పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐ పండరీనాథ్ వహ్వాల్ తెలిపారు. పర్యావరణానికి హాని కలిగించే మెట్రో ప్రాజెక్టుకు అమితాబ్ మద్దతు ఇవ్వడంపై పర్యావరణ ప్రేమికుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Related posts