telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

ఇంటర్‌ బోర్డు ఆఫీస్ లోకి ఓ నేతకు అనుమతి.. విద్యార్థుల నిరసనతో బయటికి

inter board telangana

తెలంగాణ ఇంటర్‌ బోర్డ్‌ కార్యాలయం వద్ద మంగళవారం పోలీసులు వ్యవహరించిన తీరు వివాదాస్పదమయింది. విద్యార్థులను, తల్లిదండ్రులను, ప్రతిపక్ష పార్టీల నేతలను ఎవరినీ కార్యాలయం వద్దకు రాకుండా అడ్డుకుని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కాగా అధికార పార్టీకి చెందిన ఓ నేతను మాత్రం పోలీసులు బోర్డు కార్యాలయంలోకి అనుమతించారు. సాయంత్రం 4గంటల సమయంలో టీఆర్‌ఎస్‌ నేత ఒకరు అక్కడికి రాగా.. పోలీసులు మర్యాదపూర్వకంగా లోపలికి తీసుకువెళ్లారు.

ఇంటర్‌ ఫలితాలపై ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ సభ్యులు కార్యాలయంలో ఉన్న సమయంలోనే ఆయననూ తీసుకెళ్లడం వివాదాస్పదమైంది. దీంతో అక్కడ ఉన్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తమను కూడా లోనికి అనుమతించాలంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. విద్యార్థుల నిరసనతో పోలీసులు సదరు నేతను వెంటనే బయటికి పంపించారు. ఇతర పార్టీల నేతలెవరినీ అనుమతించకుడా టీఆర్‌ఎస్‌ నేతను మాత్రం ఎలా అనుమతిస్తారని విద్యార్థులు మండిపడుతున్నారు. అయితే టీఆర్‌ఎస్‌ నాయకుణ్ని లోనికి పంపినట్లు వస్తున్న వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదని ఆబిడ్స్‌ ఏసీపీ భిక్షంరెడ్డి అన్నారు.

Related posts