telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

ఉపాధ్యాయుడితో అనుచిత ప్రవర్తన.. 6 విద్యార్థుల సస్పెండ్..

students misbehave with teacher

గతంలో ఉపాధ్యాయులంటే అమితమైన గౌరవాభిమానాలు ఉండేవి. కానీ ఇటీవల అడ్డమైన వీడియో లు చూసి, విద్యార్థులు ఉపాధ్యాయులను టీజ్ చేస్తుండటం పరిపాటి అయిపోయింది. ఇక ఉన్నత వర్గాలకు చెందిన కుటుంబాల నుండి వచ్చిన వారైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు, వారికి విద్యాలయం, బారు రెండు ఒకటే. కేవలం సర్టిఫికెట్ కోసం మాత్రమే వాళ్ళు వస్తుంటారు. తాజాగా, ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిని విద్యార్థులే ఈవ్‌టీజింగ్‌ చేసిన వీడియో వాట్సాప్‌లో వైరల్‌గా మారింది. దీనిపై విచారణ జరిపిన విద్యాశాఖ అధికారులు ఆరుగురు ఫ్లస్‌టూ విద్యార్థులను సస్పెండ్‌ చేశారు. వేలూరు జిల్లా తిరుపత్తూరులో రామకృష్ణ ప్రభుత్వ పాఠశాల ఉంది. పాఠశాలలో 800 మందికి పైగా విద్యార్థులున్నారు.

ఇక్కడ ఫ్లస్‌టూ చదువుతున్న విద్యార్థులు కొద్ది రోజుల కిందట పాఠశాల్లో ఉపాధ్యాయుడు కూర్చునేందుకు వచ్చిన సమయంలో కుర్చీని పక్కకు తోయడం, డ్యాన్సులు చేస్తూ అల్లరి చేయడం వంటివి వీడియో తీసి స్నేహితులకు వాట్సాప్‌లో పంపారు. ఈ వీడియో పలువురికి చేరడంతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులకు చేరడంతో అవాక్కయ్యారు. దీనిపై వెంటనే విచారణ జరపాలని విద్యాశాఖ డైరెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. దీనితో తిరుపత్తూరు విద్యాశాఖ అధికారి శివ, అధికారులు పాఠశాలకు వెళ్లి విచారణ జరిపారు. ఆ సమయంలో విద్యార్థులు క్రమశిక్షణ లేకుండా టీచర్‌లను తరచూ వేధిస్తున్నట్లు తెలిసింది. విద్యార్థుల తల్లిదండ్రులను రప్పించి విద్యార్థుల చేసిన చేష్టల వీడియోను చూపించి విచారణ జరిపారు. ఇదిలా ఉండగా ఈ పాఠశాలలో హెచ్‌ఎంగా పనిచేస్తున్న బాబుపై విద్యార్థులు కత్తితో దాడి చేసిన విషయం వెలుగు చూసింది. దీనిపై విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టి ఆరుగురు విద్యార్థులను సస్పెండ్‌ చేశారు. అయితే వారు పరీక్షలు రాసేందుకు మాత్రం అనుమతిస్తామని పాఠశాల నోటీస్‌ బోర్డులో లేఖ అతికించారు.

Related posts