telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

‘ఆకలి’ బదులు ‘అకలి’ .. విద్యార్థికి బడిత పూజ

Hostel Warden Beaten student

ఓ విద్యార్థి, ట్యూషన్ లో ‘ఆకలి’ బదులు ‘అకలి’ అని రాయడంతో స్కూల్ యజమాని బత్తెంతో చితకొట్టాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా భీమ్ గల్ మండలంలో జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. మండల పరిధిలోని సెయింట్‌ పాల్స్‌ స్కూల్ లో సంజయ్ అనే విద్యార్థి తొమ్మిదో తరగతి చదువుతూ అక్కడే హాస్టల్‌లో ఉంటున్నాడు.

సాయంత్రం వేళ ట్యూషన్‌ సమయంలో తెలుగు తప్పు రాశాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన స్కూల్ యజమాని బబ్లూ, బలమైన కర్రతో వీపుపై వాతలు తేలేలా కొట్టాడు. విషయం ఎవరికీ చెప్పవద్దని బెదిరించాడు. తీవ్ర గాయాలు కావడంతో భీతిల్లిన సంజయ్, విజయాన్ని తన తల్లికి చేరవేశాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించి స్కూల్ యజమాని పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.

Related posts