telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

యువతి అపహరణ.. చాకచక్యంగా తప్పించుకుని..

mptc husband kidnapped in sirisilla

అమలాపురంలో మెడిసిన్ లో పీజీ చేస్తున్న యువతిని ఓ యువకుడు కిడ్నాప్ చేయబోగా, ఆమె చాకచక్యంతో తప్పించుకుంది. ఇక్కడి కిమ్స్ వైద్య కాలేజీలో అనపర్తి ప్రాంతంలో ఓ ఉన్నత కుటుంబానికి చెందిన యువతి పీజీ వైద్యవిద్యను అభ్యసిస్తోంది. ఆమెకు బెంగళూరులో ఉంటున్న అవినాశ్ అనే యువకుడితో గత పరిచయం ఉంది. యువతికి ఇటీవలే వివాహం నిశ్చయం కాగా, ఆ విషయం తెలుసుకున్న అనినాశ్, ఆమెను కలిసేందుకు తన మిత్రుడు అజయ్ తో కలిసి కిమ్స్ ఆసుపత్రి వద్దకు వచ్చాడు. మాట్లాడాలంటూ అమ్మాయిని ఎక్కించుకుని అయినవిల్లి వైపు తీసుకెళ్లాడు.

అప్పటికే అవినాశ్ తనకు హాని తలపెట్టవచ్చని ఆమెకు అనుమానం వచ్చింది. దాన్ని మరింత బలపరిచేలా, కారు యానాం సమీపంలోకి వెళ్లగానే, అప్పటికే తాను సిద్ధం చేసుకున్న బైక్ పై యువతిని ఎక్కించుకుని, కారును అజయ్ తో పంపించేశాడు. బైక్ పై అతనితో వస్తున్న అమ్మాయి, ఐ.పోలవరం పోలీసు స్టేషన్ దగ్గరకు రాగానే, అమాంతం బైక్ పై నుంచి దూకేసింది. ఈ ఘటనను పోలీసులు చూడగా, అవినాశ్… వేగంగా బైక్ ను పోనిచ్చాడు. కిందపడ్డ ఆమెను పోలీసులు లేవదీశారు. ఆపై విషయమంతా తెలుసుకుని, అమలాపురం డీఎస్పీ వద్దకు తీసుకెళ్లారు. డీఎస్పీ ఆదేశాలపై అవినాశ్ స్నేహితుడిగా వచ్చిన అజయ్ ను అరెస్ట్ చేసి విచారిస్తున్న పోలీసులు, పరారైన అవినాష్‌ కోసం గాలిస్తున్నారు.

Related posts