telugu navyamedia
Uncategorized ట్రెండింగ్ విద్యా వార్తలు

పరీక్షా హాలులో … సినిమా చేష్టలు.. వాచీతో కాపీయింగ్ …

student coping with smart watch

ఓ డిగ్రీ విద్యార్థి చేతికి స్మార్ట్ వాచ్ ని పెట్టుకొని వచ్చాడు పరీక్షా హాలులోకి.. దాని సాయంతో మాస్ కాపీయింగ్ కు పాల్పడుతున్నాడు.. అప్పుడే వచ్చిన అధికారులకు దొరికిపోయాడు, ఇంకేముంది.. డిబార్ చేశారు. ఈ ఘటన నారాయణపేటలో జరిగింది. ఇక్కడి స్ఫూర్తి ప్రైవేటు డిగ్రీ కాలేజీలో నిన్న ఫస్ట్ సెమిస్టర్ పరీక్ష జరుగుతూ ఉండగా, ఓ విద్యార్థి, ముందుగానే కొన్ని జవాబులను ఫోటో తీసి వాచిలో స్టోర్ చేసి తెచ్చుకున్నాడు.

తాను ఫోటోలు తీసిన జవాబులకు సంబంధించిన ప్రశ్నలు రాగా, చూసి రాయడం ప్రారంభించాడు. అతని వాలకంపై అనుమానంతో పరిశీలించిన అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. దీనితో ఆ స్మార్ట్ వాచ్ ని స్వాధీనం చేసుకున్న అధికారులు, అతన్ని డిబార్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Related posts