telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ప్రభుత్వం నుంచి సానుకూల సంకేతాలు.. ఏపీఎస్ఆర్టీసీలో ఇక సమ్మె లేనట్లే!

Apsrtc offer for sleeper buses

తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ ఏపీఎస్ఆర్టీసీ కార్మిక సంఘాలు యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వంలో ఏపీఎస్ఆర్టీసీని విలీనం చేసే ప్రక్రియకు అడుగులు పడటంతో కార్మికులు తమ సమ్మె ఆలోచనను విరమించుకున్నారు. ఆర్టీసీ కార్మికుల చిరకాల కోరికను తీర్చేలా విలీనానికి అధ్యయన కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం నుంచి హామీ రావడంతో సమ్మె నోటీసును ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ దామోదరరావు స్పష్టం చేశారు.

కార్మికుల డిమాండ్లను పరిష్కరించేందుకు సీఎం జగన్ సానుకూలంగా ఉన్నారని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు వెల్లడించడంతో సమ్మెను విరమించుకున్నట్టు ఆర్టీసీ జేఏసీ తెలిపింది. ఈ నెల 10న వచ్చి కలవాలని సీఎం నుంచి సమాచారం అందిందని, ఆ సమావేశంలో కార్మికుల సమస్యలను వివరిస్తామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుపుతున్న సమ్మె సన్నాహక సభలను కూడా రద్దు చేశామని అన్నారు.

Related posts