telugu navyamedia
ట్రెండింగ్ సామాజిక

నా మొగుడు మురికిగా ఉన్నాడు.. నాకు విడాకులు ఇప్పించండి.. : ఓ భార్య

strange reasons for getting divorce

రానురాను కొన్ని విషయాలపై అవగాహనా రాహిత్యం ఎంతగా ఉంటుందో అది ఊహించడానికే సాధ్యం కాదు.. దానికి ఒక మచ్చుతునకగా ఈ సందర్భం చూడండి..ఆధునిక ప్రపంచంలో మనుషుల మధ్య బంధాలకు విలువే లేకుండా పోయిందో .. ఇది చదివిన తరువాత తెలిసిపోతుంది మీకు. కొన్ని మానవ బంధాలు ఎంత ద్రుఢంగా ఉంటాయో కొన్ని బంధాలు అంతే త్రుణప్రయాంగా ఉంటాయి. మంచినీళ్ల బాటిల్ కోసం కారు ఆపలేదనో, పానీ పూరీ తినిపించలేదనో, మొక్కజొన్న పొత్తు వేడిగా తేలేదనో విడాకులు తీసుకుంటున్న ఈ రోజుల్లో కట్టుకున్న మొగుడు నిత్యం మురికిగా ఉంటే ఎవరు భరిస్తారు చెప్పండి.

ఒకప్పుడు విడాకుల ప్రస్తావన బలమైన కారణాలుంటేగానీ వచ్చేది కాదు. కానీ ఇప్పుడు చిన్న చిన్న కారణాలను చూపి విడిపోవాలని చూస్తున్నారు. తాజాగా మధ్యప్రదేశ్‌లో ఓ జంట విడాకులు కావాలని కోర్టును ఆశ్రయించింది. ఇంతకీ కారణమేంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు. తన భర్త కొన్ని రోజుల పాటు స్నానం చేయకుండా, గడ్డం గీసుకోకుండా ఉంటున్నారని ఓ మహిళ విడాకుల కోసం న్యాయ స్థానాన్ని ఆశ్రయించింది.

భోపాల్‌ ప్యామిలీ కోర్టు ఇలాంటి అరుదైన సంఘటన పై విచారణ ప్రారంభించి, ఇద్దరినీ ఆరు నెలల పాటు విడిగా ఉండాలని తెలిపింది. అప్పుడే విడాకులు ఇవ్వగలమని స్పష్టం చేసింది. వీరిని కౌన్సెల్‌ చేసిన షెయిల్‌ అవస్థీ తెలిపిన వివరాల ప్రకారం.. భోపాల్‌లోని బరిగఢ్‌కు చెందిన ఓ జంట విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. తన భర్త వరుసగా ఏడు నుంచి ఎనిమిది రోజుల పాటు స్నానం చేయడని దరఖాస్తులో పేర్కొంది.

దీనితో అతని నుంచి దుర్గంధం వస్తోందని, స్నానం చేయమని చెబితే పెర్‌ఫ్యూమ్‌తో సరిపెట్టుకుంటాడని తెలిపింది. అతని ప్రవర్తనతో విసిగి పోయిన ఆమె విడాకులు కావాలని కోరింది. దానికి భర్త కూడా సమ్మతించడంతో ఇద్దరూ కలిసి కోర్టును ఆశ్రయించారు. వీరిది కులాంతర వివాహం. అదీ పెద్దల అనుమతితో జరిగిన పెళ్లి కావడం గమనార్హం. మొత్తానికి మురికి మొగుడితో సంసారం మూణ్నాళ్లలో ముగిసినందుకు సదరు మహిళ ముసిమముసి నవ్వు నవ్వుకుంటుందట..!

Related posts