• Home
  • వార్తలు
  • స్టాక్ మార్కెట్ పతనం…నిముషాల వ్యవధిలో 2.5 లక్షల కోట్లు ఆవిరి…
రాజకీయ వార్తలు వార్తలు

స్టాక్ మార్కెట్ పతనం…నిముషాల వ్యవధిలో 2.5 లక్షల కోట్లు ఆవిరి…

stock markets loses 2.5 laks lost in minutes

రెండు రోజుల క్రితమే కాస్త కోలుకుంది..అని అనుకున్నామో లేదో మరో భారీ దెబ్బ తగిలింది స్టాక్ మార్కెట్ కి. నిముషాల వ్యవధిలో ఒక్కసారిగా 1000 పాయింట్లు కోల్పోయింది. దీనితో క్షణాలలో 2.5 లక్షల కోట్లు ఆస్తులు ఆవిరైపోయాయి. ప్రధానంగా ఈక్విటీలను నమ్ముకున్న వారు పెద్ద ఎత్తున అమ్ముకాలకు పెట్టడం, అంతర్జాతీయ ఒడిదుడుకులు, క్రూడ్ ఆయిల్ ధరలు, ఇక మరో మారు ఆర్ధిక మాంద్యం రానుంది అనే వార్తల నేపథ్యంలో ఈ క్షీణత సంభవించింది.

ఉదయం 9 గంటలకు మొదలై నష్టాలతోనే ట్రేడింగ్ జరిగి 34,769 ఉన్నది కాస్తా 34,510 పాయింట్ల వద్ద సెన్సెక్స్ ప్రారంభం అయ్యింది. 9:15 కల్లా 33,840 పాయింట్లకు, మరో ఐదు నిముషాలలో 9:20 కి 33, 746 పాయింట్లకు పడిపోయింది. ఈ కాస్త సమయంలో ఇన్వెస్టర్లు 2.50 లక్షల కోట్ల సంపదను నష్టపోయారు. ఇక బీఎస్ఈ సెన్సెక్స్ 50, నెక్ట్స్ 50, బీఎస్ఈ 100 సూచీలన్నీ నష్టాల్లోనే ఉన్నాయి. ఎన్..ఎస్.ఈ కూడా 251 పాయింట్ల నష్టంతో 10,208 వద్ద కొనసాగుతుంది. నిఫ్టీ-50లో 46 సంస్థలు నష్టాలతోనే నడుస్తున్నాయి. చమురు సంస్థలు లాభాలలో ఉండగా, ఆటో, ఫైనాన్స్, బ్యాంకింగ్ సంస్థలు ఒత్తిడిలో ఉన్నాయి.

Related posts

తిరుమలలో వెయ్యికాళ్ల మండపాన్ని తిరిగి నిర్మించాలి: రోజా

madhu

కశ్మీరా ‘చిత్రాలు’…

chandra sekkhar

సాంకేతికంగా మనం ముందున్నాం :దేబ్

admin

Leave a Comment