telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బుల్లితెర బిగ్ రియాలిటీ షో … బిగ్ బాస్ సీజ‌న్ 3.. తెలుగు .. అధికారిక ప్రకటన..

starmaa official on bigg boss 3 telugu

తెలుగులో సీజ‌న్ 3 బిగ్ బాస్ సిద్ధమైంది. గ‌త కొద్ది రోజులుగా ఈ కార్య‌క్ర‌మానికి సంబంధించి అనేక వార్త‌లు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఈ కార్య‌క్ర‌మాన్ని హోస్ట్ చేసే వారితో పాటు పాల్గొనే వారికి సంబంధించి అనేక పేర్లు సామాజిక మాధ్య‌మాల‌లో చ‌క్క‌ర్లు కొట్టాయి. అయితే స్టార్ మా యాజ‌మాన్యం తాజాగా బిగ్ బాస్ 3 కార్య‌క్ర‌మాన్ని వెండితెర మ‌న్మ‌థుడు నాగార్జున హోస్ట్ చేయ‌బోతున్న‌ట్టు అధికారికంగా ప్ర‌క‌టించారు.

త‌రాలతో సంబంధం లేకుండా సంపాదించుకున్న అభిమానం, సామాజికంగా సాధించుకున్న పేరు ప్ర‌ఖ్యాత‌ల‌తో ఆయ‌న ప్ర‌త్యేక‌మైన వ్య‌క్తిత్వం ప్రేక్ష‌కుల‌లో విభిన్న వ‌ర్గాల‌కి ఈ షోని చేర‌వేస్తుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేద‌ని బిజినెస్ హెడ్ అలోక్ జైన్ తెలిపారు. అద్భుత‌మైన వినోదాన్ని త‌ప్ప‌క అందిస్తామ‌ని ఆయ‌న పేర్కొన్నారు. నాగార్జున మాట్లాడుతూ.. నేను ఎన్నో విష‌యాల‌లో ప్ర‌యోగాలు చేశాను. నాకు టెలివిజ‌న్ కొత్త కాదు. బిగ్ బాస్ లాంటి షో చేయ‌డం కొత్త అనుభూతి. ఇలాంటి షోలో నేను ఓ పార్ట్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ కొత్త ప్ర‌యాణం కోసం ఎదురు చూస్తున్నాను అని నాగ్ పేర్కొన్నారు. 100 రోజుల పాటు ఆస‌క్తిక‌రంగా సాగ‌నున్న ఈ షోలో పాల్గొనే 14 మంది కంటెస్టెంట్స్ ఎవ‌ర‌న‌ది తెలియాలంటే షో ప్రారంభం వ‌ర‌కు ఆగాల్సిందే. జూలై 21 నుండి తెలుగులో బిగ్ బాస్ సీజ‌న్ 3 స్టార్ట్ కానుంద‌ని తెలుస్తుంది!!

Related posts