telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

బిగ్‌బాస్‌ ను ఉపయోగించుకుని సరికొత్త బ్రాండ్‌ షోను ఆవిష్కరించిన స్టార్‌ మా…

Bigg-Boss-4

బిగ్‌బాస్‌ సీజన్‌ 4ను ఉపయోగించుకుని తమ సరికొత్త బ్రాండ్‌ షోను ఆవిష్కరించిన స్టార్‌ మా. ప్రతి సీజన్‌లోనూ ‘బిగ్‌బాస్‌’తో స్టార్‌ మా, తమ సమర్పణను పునరావిష్కరించడంతో పాటుగా మరింత ఆకట్టుకునే రీతిలో వస్తోంది. అశేష ప్రేక్షాదరణనూ పొందుతుంది. ఈ సీజన్‌ కోవిడ్‌–19 సంక్షోభ సమయంలో ప్రారంభం కావడంతో పాటుగా వరదలు లాంటివి భారీ ప్రభావాన్ని చూపాయి. అయినప్పటికీ ‘బిగ్‌బాస్‌ ’షో పట్ల ప్రేక్షకాదరణ ఏ మాత్రం తగ్గలేదు. ఈ షో పై వారి ప్రేమా తగ్గలేదు. ఇప్పటి వరకూ ‘బిగ్‌బాస్‌’ సీజన్‌లలో అతిపెద్ద ఆవిష్కరణగా సీజన్‌ 4 నిలుస్తోంది. ఇప్పటి వరకూ ఈ సీజన్‌ బలీయంగా అశేష ప్రేక్షకాదరణతో ముందుకు సాగడంతో పాటుగా స్టార్‌ మా తమ నాయకత్వ స్ధానాన్ని మరింతగా ఈ షో ద్వారా బలోపేతం చేసుకుంది. ఫైనల్‌కు కొద్ది వారాలు మాత్రమే మిగిలి ఉండటంతో ఈ షో పట్ల మరింతగా ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తున్నారు మరియు దీనిని ఒడిసిపట్టుకుంటూ స్టార్‌ మా ఇప్పుడు తమ వీక్షకుల కోసం సరికొత్త బ్రాండ్‌ షో ‘గుప్పెడంత మనసు’ను రాత్రి 7 గంటలకు పరిచయం చేసింది మరియు తమ అతి పెద్ద షోలలో ఒకటైన ‘వదినమ్మ’ను రాత్రి 9.30 గంటలకు మార్చడం ద్వారా తమ ప్రైమ్‌టైమ్‌ను మరింత బలోపేతం చేసింది.

Related posts