telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రాజమౌళి దర్శకత్వంలో మహేష్… భారీ యాక్షన్ మూవీ…?

Mahesh-babu

జక్కన్న దర్శకత్వంలో ప్రస్తుతం క్రేజీ మల్టీస్టారర్ “ఆర్ఆర్ఆర్” రూపొందుతున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్, చరణ్ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న ఈ సినిమా 450 కోట్లతో నిర్మితమవుతోంది. ఆ తరువాత సినిమాను మహేశ్ బాబుతో రాజమౌళి ప్లాన్ చేశాడు. ఈ సినిమా బడ్జెట్ గా 300 కోట్లను కేటాయించారనే టాక్ వినిపిస్తోంది. మహేశ్ బాబు సినిమా కోసం 300 కోట్ల బడ్జెట్ ను కేటాయించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాలో మహేశ్ బాబును జేమ్స్ బాండ్ తరహా పాత్రలో రాజమౌళి చూపించనున్నాడని అంటున్నారు. యాక్షన్ సన్నివేశాలపై భారీస్థాయిలో ఖర్చు చేయనున్నట్టు చెప్పుకుంటున్నారు. తెలుగుతో పాటు ఇతర భాషల్లోను ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. కృష్ణ పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ నెల 31వ తేదీన ఈ ప్రాజెక్టును ప్రకటించి, ఆ తరువాత ప్రీ ప్రొడక్షన్ పనులను మొదలెడతారని అంటున్నారు. మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే అటు మహేష్ గానీ, ఇటు రాజమౌళి గానీ స్పందించాల్సిందే.

Related posts