telugu navyamedia
political trending

మోడీ సార్ .. హిందీ రాష్ట్రాలనే కాదు.. మమ్మల్ని పట్టించుకోండి .. : స్టాలిన్

pujas performed for stalin for cm

డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌, కేవలం హిందీ మాట్లాడే రాష్ట్రాలనే మోదీ గుర్తించే రోజులు పోయాయని, ఆ రాష్ట్రాలతోనే దేశం నిర్మితం కాలేదని గుర్తుంచుకోవాలని నరేంద్ర మోదీకి వార్నింగ్ లాంటి సందేశమిచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తిరుగులేని మెజారిటీని సాధించిన నేపథ్యంలో స్టాలిన్ స్పందించారు.

తాజా ఎన్నికలలో తమిళనాడులో 38 సీట్లకు గాను డీఎంకే 36 సీట్లు గెలుచుకుంది. కానీ బీజేపీ అక్కడ ఖాతా కూడా తెరవలేకపోయింది. ఈ నేపథ్యంలో స్టాలిన్ మోదీని ఉద్దేశించి మాట్లాడుతూ, ‘‘నిర్మాణాత్మక రాజకీయాలేమైనా పరిధులకు లోబడి మాత్రమే ఉండాలి. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఏ ఒక్క రాష్ట్రాన్నీ విస్మరించడానికి వీల్లేదు. కేవలం హిందీ మాట్లాడే రాష్ట్రాలనే మీరు గుర్తించే రోజులు పోయాయి. ఆ రాష్ట్రాలతోనే దేశం నిర్మితం కాలేదని మీరు గుర్తుంచుకోవాలి’’ అని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.

Related posts

రాశిఫలాలు : .. ఉద్యోగరీత్యా ప్రయాణాలు.. పనులలో ఆటంకాలు ..

vimala p

కర్ణాటక : .. శివకుమార్ ను .. అదుపులోకి తీసుకున్న పోలీసులు..

vimala p

తాను గెలవకపోతే .. నష్టపోయేది దేశమే.. : ట్రంప్

vimala p