telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

రాహుల్ ను .. వారిస్తున్న స్టాలిన్.. రాజీనామా వద్దు..

stalin on rahul resignation

రాహుల్‌గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానని బీష్మించుకుని కూర్చున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ స్పందించారు. రాహుల్‌గాంధీ తన పదవి నుంచి తప్పుకోవద్దని స్టాలిన్ కోరారు. ఈ మేరకు స్టాలిన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతతో ఫోన్‌లో మాట్లాడారు. కాంగ్రెస్ చీఫ్ పదవి నుంచి తప్పుకోవాలనేఆలోచనను రాహుల్ ఉపసంహరించుకోవాలని స్టాలిన్ సూచించారు.

స్టాలిన్, లోక్‌సభ ఎన్నికల్లో పరాజయం పాలైనప్పటికీ.. మీరు దేశ ప్రజల హృదయాలను గెలుచుకున్నారని రాహుల్‌నుద్దేశించి వ్యాఖ్యానించినట్లు కాంగ్రెస్ సీనియర్ నేత తెలిపారు. రాహుల్ నిర్ణయాన్ని వెనక్కితీసుకునే దిశగా ఇప్పటికే యూపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి ప్రియాంకా గాంధీ వాద్రా, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్‌తోపాటు పలువురు సీనియర్ నేతలు రాహుల్‌ను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే.

Related posts