telugu navyamedia
andhra news study news trending

వచ్చే ఏడాది నుంచి ఇంటర్నల్ మార్కులు ఉండవు: సంధ్యారాణి

Degree exams TDP questiona Anantapur

ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెండు రోజుల్లో వెబ్‌సైట్‌లో మార్కుల మెమోలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఏపీలో 6,21,634 మంది విద్యార్థులు ఈసారి పదో తరగతి పరీక్షలు రాశారని సంధ్యారాణి తెలిపారు.

మొత్తం 94.88 శాతం మంది పాస్ అయ్యారని ఆమె ప్రకటించారు. ఉత్తీర్ణత విషయంలో తూర్పుగోదావరి జిల్లా 98.19 శాతంతో అగ్రస్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. కనిష్టంగా నెల్లూరు జిల్లాలో 89.19 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులు అయ్యారని తెలిపారు. వచ్చే ఏడాది నుంచి ఇంటర్నల్‌ మార్కులు ఎత్తివేయాలనే ప్రతిపాదన చేస్తున్నట్లు ఆమె తెలిపారు. పరీక్షా పేపర్‌ విధానంలోనూ మార్పులు ఉండొచ్చునని సంధ్యారాణి పేర్కొన్నారు.

Related posts

వేసవి సెలవుల పొడిగింపు.. జూన్‌ 12 నుంచి స్కూల్

vimala p

“మళ్లీ మళ్లీ చూశా” టీజర్…

vimala p

ఏపీలో .. పోలీసులకు పదోన్నతులు..

vimala p