telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

పరీక్షలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలి: మంత్రి కొప్పుల

koppula eashwar trs

పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధుల్లో భయాన్ని పోగొట్టి వారిని మానసికంగా పరీక్షలకు సిద్ధం చేయాలని తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అధికారులకు సూచించారు. విద్యార్దులు భౌతిక దూరం పాటిస్తూ, ఎప్పుడూ శుభ్రమైన మాస్క్‌లు ధరించి, తరచూ చేతులను కడుక్కునేలా వారికి శానిటైజర్‌లను సరఫరా చేయాలన్నారు. స్వీయ నియంత్రణ పాటిస్తేనే కరోనా బారి నుంచి కాపాడుకోవచ్చని అన్నారు.

ఈ నెల 8వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్ధులు ఇలాంటి అన్ని జాగ్రత్తలు తీసుకునే విధంగా అధికారులు వారికి అవగాహన కల్పించాలన్నారు. ఎస్సీ, హాస్టళ్లలో విద్యార్ధులకు జూన్‌ 4న ప్రత్యేకంగా హాస్టల్స్‌ తెరుస్తారని విద్యార్ధులు చేరడానికి వారికి సమాచారం పంపించాలన్నారు. వారు వచ్చే సరికే సంబంధిత వసతి గృహాలను శుభ్రపర్చి, శానిటైజ్‌ చేయాలని సూచించారు.

Related posts