telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘ఆర్ఆర్ఆర్ ‘ సినిమా ట్రయల్ షూట్ ఆగినట్టే…?

RRR

రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్ ‘ సినిమా టెస్ట్ షూట్ ను రెండు రోజుల పాటు నిర్వహించాలని భావించారు. ఎన్టీఆర్, చరణ్ ల స్థానంలో డూప్ లను ఉపయోగించి ప్రభుత్వ గైడ్ లైన్స్ ను ఫాలో అవుతూ షూటింగ్ చేయాలని జక్కన్న భావించాడు. అందుకు రెడీ అయ్యి పోలీసుల నుండి అనుమతుల కోసం ప్రయత్నించారు. హైదరాబాద్‌లో కరోనా విజృంభిస్తుందనే కారణమో లేదంటే ఇతర కారణాలో తెలియదు కాని “ఆర్ఆర్ఆర్” ట్రయిల్ షూట్ ఆగిపోయిందని తెలుస్తుంది. షూటింగులకు అనుమతిస్తే ప్రమాదం ఎలా ఉంటుందోనన్న ఆందోళన పోలీసుల్లో వ్యక్తమవుతోందట. అందుకే ఇంకా టెస్ట్ షూట్ అనుమతుల ఇవ్వలేదని సమాచారం. టాలీవుడ్ సినిమా షూటింగ్‌లకి అనుమతులు వచ్చినా, ఎవరూ షూటింగ్స్ నిర్వహించడం లేదు. కరోనా మహమ్మారి విజృంభణ తగ్గాకే షూటింగ్స్ ప్రారంభించడం మంచిదని మేకర్స్ భావిస్తున్నారట.

Related posts