telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ సినిమా వార్తలు

జర్నలిజం లో నిష్టాతులను సత్కరించిన శృతిలయ..

srutilaya awards to journalists

తెలుగు, ఉర్దూ పత్రికా రంగంలో విశేషమైన కృషి చేసిన నలుగురు సీనియర్ జర్నలిస్టులను బుధవారం నాడు హైదరాబాద్ రవీంద్ర భారతిలో సత్కరించి అవార్డులను బహుకరించారు. శృతిలయ ఆర్ట్ అకాడమీ, సీవేల్ కార్పొరేషన్, ఆదర్శ ఫౌండేషన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ప్రపంచ పత్రికా దినోత్సవం సందర్భంగా పత్రికా రంగంలో తమదైన ముద్ర వేసిన జర్నలిస్టులను సత్కరించడం ఎంతో సముచితంగా ఉందని ముఖ్య అతిధిగా వచ్చిన తెలంగాణ సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ చెప్పారు.

srutilaya awards to journalistsడాక్టర్ జి.ఎస్ వరదా చేరి గారు ఆంధ్ర భూమి, ఈనాడు పత్రికల్లో పనిచేసి, అనంతరం తెలుగు విశ్వవిద్యాలయంలో జర్నలిజం విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు, గుడిపూడి శ్రీహరి హిందూ పత్రికలో సాంస్కృతిక కార్యక్రమాల విశేషాలు రాసేవారు, సితార లో సినిమా సమీక్షలు రాసేవారు, భగీరథ గారు నాలుగు దశాబ్దాల నుంచి సినిమా జర్నలిస్టుగా అందరికీ సుపరిచితులు. వారు జర్నలిస్టుగానే కాకుండా సినిమా ప్రచారంలో కూడా ఎన్నో చిత్రాలకు పనిచేశారు. హష్మీ ఉర్దూ పత్రికల్లో పనిచేస్తూ యూనియన్ విషయాల్లో కూడా క్రియా శీలకంగా వున్నారు. ఈ నలుగురు జర్నలిజం విలువలు కాపాడినవారు, అందుకే వీరిని సత్కరించటం ఎంతో ఆనందంగా వుంది అని చెప్పారు.

srutilaya awards to journalistaకార్యక్రమానికి అధ్యక్షత వహించిన వై .కె నాగేశ్వర రావు మాట్లాడుతూ .. ప్రపంచ పత్రిక దినోత్సవం సందర్భంగా వరదా చారి గారు, శ్రీహరి గారు, భగీరథ గారు, హష్మీ గారిని సన్మానించాలని అనుకున్నామని, రఫీ గారిని అభినందిస్తున్నానని చెప్పారు. సమాజానికి సేవ చేస్చిన ఈ జర్నలిస్టులు మార్గదర్శకులని నాగేశ్వర రావు చెప్పారు. బండారు సుబ్బారావు మాట్లాడుతూ సీనియర్ జర్నలిస్టులను సత్కరించుకోవడం తనకెంతో సంతోషాన్ని కలిగిస్తున్నదని, ఈ కార్యక్రంలో పాల్గొనడం ఆనందంగా ఉందని చెప్పారు. కళ పత్రిక మహమ్మద్ రఫీ మాట్లాడుతూ .. పత్రికా దినోత్సవం సందర్భంగా సీనియర్ జర్నలిస్టులను సత్కరిద్దామని శ్రీమతి ఆమని గారు చెప్పిన తరువాత డాక్టర్ జిఎస్ వరదాచారి గారు, గుడిపూడి శ్రీహరి గారు, ఎమ్ ఎస్ హెచ్ హష్మీ గారిని ఎంపిక చేశామని చెప్పారు. ఈ నలుగురు జర్నలిజంలో పాత్రికేయ విలువలను కాపాడినవారేనని రఫీ చెప్పారు.

శృతిలయ ఆమని మాట్లాడుతూ .. పత్రికా దినోత్సవం రోజున జర్నలిజంలో ఎంతో పేరు సంపాదించిన వారిని సత్కరించుకోవడం మాకెంతో తృప్తి గా వుంది అన్నారు. అనంతరం జర్నలిస్టులకు సన్మానించి అవార్డులను బహుకరించారు. ఈ సందర్భంగా వరదా చారి, శ్రీహరి, హష్మీ కృతజ్ఞతలు తెలిపారు.

srutilaya awards to journalistsభగీరథ మాట్లాడుతూ -“1977లో నేను వెండితెర సినిమా పత్రికలో జర్నలిస్టుగా జీవితం ప్రారంభించాను. శాండిల్య గారు నాకు అవకాశం ఇచ్చారు. ఆ తరువాత 1979లో ఆంధ్ర జ్యోతి సంస్థ నుంచి వెలువడే జ్యోతి చిత్రాల్లో చేరాను. ఇక్కడే నేను జర్నలిస్టుగా ఎదిగాను, గుర్తింపు, గౌరవం సంపాదించాను. జర్నలిజం అంటే నాకు ఇష్టం, అందుకే ఈ వృత్తిలో ఇప్పటివరకు విలువలు పాటిస్తూ వస్తున్నాను. జర్నలిజం తో రచయితగా కూడా 13 పుస్తకాలు రాశాను. సినిమాల నిర్మాణంలో కూడా పాలు పంచుకున్నాను, ఎన్నో ప్రభుత్వ కమిటీల్లో పనిచేశాను, ఇప్పటి వరకు 15 అవార్డులు అందుకున్నాను” అని చెప్పారు.

srutilaya awards to journalistaఈ కార్యక్రమంలో యువకళావాహిని నాగేశ్వర రావు, మామిడి హరి కృష్ణ, ఆర్ ఎన్ సింగ్, బండారు సుబ్బారావు, శ్రీమతి ఆమని, భీం రెడ్డి, మహమ్మద్ రఫీ, శ్రీమతి విజయ లక్ష్మి, శ్రీమతి భారతి, డాక్టర్ నాగేశ్వర రావు, గాంధీ, కుసుమ భోగరాజు, శ్రీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సభకు ముందు చినుకులా రాలి అనే సంగీత విభావరిని ఆమని ఆధ్యర్యంలో జరిగింది.

Related posts