• Home
  • వార్తలు
  • #మీటూ..రొమాన్స్ లో శృతితో యాక్షన్ కావాలన్న అర్జున్.. స్పష్టత ఇచ్చిన దర్శకుడు
Trending Today వార్తలు సినిమా వార్తలు

#మీటూ..రొమాన్స్ లో శృతితో యాక్షన్ కావాలన్న అర్జున్.. స్పష్టత ఇచ్చిన దర్శకుడు

Sruthi Hariharan on MeToo against Arjun, Director Arun Clarity

హాలీవుడ్ లో మొదలైన మీటూ ఉద్యమం ప్రపంచ వ్యాప్తంగా పలు రంగాల్లో సంచలనం సృష్టించింది… చీకటికోణాల్లో వెలుగులు నింపేందుకు ఉదృతంగా మారిన ఈ ఉద్యమంలో మహిళలు తాము ఎదుర్కొన్న, ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులను బట్టబయలు చేస్తున్ననేపథ్యంలో… దక్షిణాదికి చెందిన ప్రముఖ నటుడు. యాక్షన్ కింగ్ అర్జున్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి…

తమిళ, కన్నడ భాషల్లో తెరకెక్కిన ఓ సినిమాలో అర్జున్‌తో కలిసి నటించిన హీరోయిన్ శ్రుతి హరిహరణ్ అర్జున్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది… సినిమాలోని ఓ రొమాంటిక్ సీన్ రిహార్సల్ సందర్భంగా అర్జున్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని శ్రుతి హరిహరణ్ చేసిన ఆరోపణలను వెంటనే ఖండించారు.. కాగా తాజాగా ఆ సినిమా దర్శకుడు అరుణ్ వైద్యనాథన్ స్పందిస్తూ… ఆ సీన్ చాలా రొమాంటిక్‌గా ఉంటుంది. సీన్ విషయం మొదట అర్జున్ కి చెప్పగా…ఆయన వద్దన్నారు.. నాకు టీనేజ్ కూతురుంది…

ఈ వయసులో అలాంటి సీన్లు చేస్తే బాగోదు అన్నారు.. నేను అర్జున్‌కు సర్దిచెప్పి ఆ సీన్ తెరకెక్కించాను.. అలాంటిది ఇప్పుడు శ్రుతి హరిహరణ్ చేస్తున్న ఆరోపణలు వింటుంటే చాలా షాకింగ్‌గా ఉంది.. అర్జున్ ఓ జెంటిల్మెన్‌.. వారిద్దరూ నాకు మంచి స్నేహితులని దర్శకుడు అరుణ్ వైద్యనాథన్ వ్యాఖ్యానించారు..







 

Related posts

జనసేనలోకి మరో జగన్ ఎమ్మెల్యే…

chandra sekkhar

బిగ్ బాస్ 3 కి నాని దూరం … ఎందుకంటే

jithu j

తిరుమల శ్రీవారి సమాచారం

jithu j

Leave a Comment