telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

మూడు పదులు దాటాక కూడా.. అందాలు ఆరబోస్తున్న .. శ్రియా ..

sriya hot pics viral

మూడు పదుల వయసు దాటగానే అందంలో కాస్త వెనెకబడుతుండటం సహజం. అయితే కొందరు హీరోయిన్స్ మాత్రం 40 దాటినా ఇంకా ఆకట్టుకుంటూనే ఉంటారు. తమ చార్మ్ తగ్గిపోకుండా జాగ్రత్తలు తీసుకొంటూ ఉంటారు. ప్రస్తుతం శ్రియ కూడా తన అందంతో యువతరాన్ని వెనుకకు నెట్టివేస్తున్నది. 36 ఏళ్ల వయసు దాటుతున్నా ఇంకా అందాల ప్రదర్శనలో ఎవ్వరికీ తీసిపోనని రుజువు చేసుకొంటుంది.. శ్రీయ శరన్. ఈ మధ్యనే జరిగిన ఫ్యాషన్ వీక్ లో ఆమె ప్రదర్శించిన షోకి హీరోయిన్స్ అందరికి చెమటలు పట్టిన్నట్లు అయింది. ఓ విధంగా శ్రియా రాబోయే యంగ్ తరానికి గట్టిపోటీని ఇచ్చింది అని చెప్పాలి. దాదాపు సినిమా ఫీల్డ్ లోకి వచ్చి పద్దెనిమిదేళ్లు అవుతున్నా ఇప్పటికి ఇంకా 16 అన్నట్టు తన ఘాటైన సోయగాలతో శ్రియా మతి పోగొడుతోంది. ప్రస్తుతం అంతగా ఆఫర్స్ రాకున్నా వచ్చిన సినిమాలనే చక్కగా చేసుకుంటూ మరో ఐదేళ్లు కెరీర్ ను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తోంది.

ఈ ఫొటో షూట్ చూస్తే మాత్రం ఒక్కసారిగా ఆమె వయసు కొన్నేళ్లు తగ్గిపోయినట్లు కనిపిస్తోంది. చాలా రిఫ్రెషింగ్‌గా ఉన్న ఈ లుక్‌లో అందాలు ఆరబోస్తూ కుర్రాళ్ల గుండెల్లో మంటలు పుట్టిస్తోంది శ్రియ. పదేళ్ల కిందటే శ్రియ కెరీర్ ముగిసిపోయినట్లే కనిపించింది. అయినా ఆమె ఏమీ ఆశలు వదులుకోలేదు. ఐటెం సాంగ్స్ చేసింది. గెస్ట్ క్యారెక్టర్లు చేసింది. తర్వాత మళ్లీ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ లాంటి సినిమాల్లో కీలక పాత్రలతో మెరిసింది. ఆ తర్వాత ఓ రష్యా వ్యక్తిని పెళ్లాడిన శ్రియ.. ఇక సినిమాలు మానేస్తుందనుకుంటే ఆమె ఇండస్ట్రీని విడిచిపెట్టలేదు. ఈ తరం హాట్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని రీతిలో అందాలు ఆరబోస్తూ శ్రియ సోషల్ మీడియాలో మళ్లీ హాట్ టాపిక్ అవుతోంది. ప్రస్తుతం తమిళంలో ‘సెండక్కారి’ అనే ఓ సినిమా చేస్తున్న శ్రియ.. బాలకృష్ణ-బోయపాటి చిత్రంలో ఓ పాత్ర చేయబోతున్నట్లు తెలుగునాట గుసగుసలు వినిపిస్తున్నాయి.

Related posts