telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పెళ్లి తరువాత.. తెరపై తల్లిగా శ్రియ ..

sriya as mother in tollywood movie

తెలుగు సినిమాల లో హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన శ్రియ ఇప్పుడు తల్లిగా నటించబోతుంది. ఇష్టం సినిమా ద్వారా టాలీవుడ్ పరిచయమైన శ్రియ, హీరోయిన్ గా రాణిస్తూనే, ప్రత్యేక గీతాల్లో నటించి ప్రేక్షుకులను మెప్పించింది. పాత్రకు తగ్గట్టు తనని తాను మల్చుకు నే ఈ అమ్మడు, ప్రస్తుతం పెళ్లి చేసుకుని అడపా, దడపా సినిమాల్లో నటిస్తోంది. నితిన్ హీరోగా, చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వం లో రూపొందనున్న సినిమా లో శ్రియ తల్లి పాత్ర లో కన్పించనునంట్లు తెలుస్తోంది. సినిమా లో శ్రియ పాత్ర అత్యంత కీలకమైనదని సినిమా యూనిట్ చెబుతున్నారు.

శ్రియ ఎవరికి తల్లిగా నటించనున్నది అన్నది మాత్రం సస్పెన్స్ గా మారింది. నితిన్ సరసన ఈ సినిమా లో ప్రియా వారియర్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెల్సిందే. శ్రియ గతం లోను పాత్రకు అనుగుణంగా తల్లి పాత్రల్లో నటించింది. తెలుగు లో గోపాల గోపాల సినిమా లో ఒక బాబు కు తల్లిగా నటించిన ఈ ముద్దుగుమ్మ, బాలకృష్ణ హీరోగా దర్శకుడు క్రిష్ రూపొందించిన గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాలోనూ తల్లి పాత్రలో మెప్పించింది. ఇక హిందీ లో అజయ్ దేవగన్ హీరోగా తెలుగు రీమేక్ చిత్రం దృశ్యం లోను తల్లి పాత్ర లో నటించింది.

Related posts