telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

టీటీడీ : .. శ్రీవాణి పథకంతో .. ఎస్సీ, ఎస్టీ కాలనీలో శ్రీవారి ఆలయాలు ..

TTD gold thefted will be to Tirumala today

శ్రీవాణి పథకంతో టీటీడీ నూతన విధానాన్ని తెరపైకి తీసుకొచ్చింది. ఈ పథకానికి ఇప్పటికే పాలకమండలి ఆమోదం లభించింది. దీంతో బ్రహ్మోత్సవాలు తరువాత నూతన పథకాన్ని ప్రారంభించనుంది. హిందూ ధార్మిక ప్రచారానికి ఏటా తిరుమల తిరుపతి దేవస్థానం 2వందల కోట్ల రూపాయలను కేటాయిస్తోంది. తాజాగా ఎస్సీ, ఎస్టీ కాలనీలో శ్రీవారి ఆలయాలను నిర్మించేందుకు రంగం సిద్దం చేస్తోంది. దీనికి నిధులు సేకరించే పనిలో పడింది. ఇందుకోసం శ్రీవాణి పేరుతో ఓ పథకాన్ని ప్రారంభించింది. ఎలాంటి ప్రచారం లేకుండానే ప్రారంభించిన ఈ పథకానికి భక్తులు ఇప్పటికే 92 లక్షల రూపాయలు విరాళంగా సమర్పించారు. పూర్తిస్థాయి ప్రచారంతో భక్తులకు దర్శనభాగ్యం కూడా కల్పిస్తే, ఈ పథకం ద్వారా విరాళాలు మరింత ఎక్కువగా సేకరించే అవకాశాలు వున్నాయి. వెనుకబడిన ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి నిధులు సేకరించేందుకు ఉద్దేశించింది శ్రీవాణి పథకం.

ఇప్పటివరకు తిరుమల తిరుపతి దేవస్థానం 9 ట్రస్టులను నిర్వహిస్తోంది. అన్నప్రసాదం, ప్రాణాదానం, గోసంరక్షణ, వేదపరిరక్షణ, బర్డ్, బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని, బాలామందిర్, విద్యాదానం లాంటి ట్రస్టులను నిర్వహిస్తోంది. వీటికి లక్ష రూపాయలు విరాళంగా సమర్పించిన భక్తుడికి ప్రతి ఏటా దర్శనభాగ్యం కల్పిస్తోంది టీటీడీ. శ్రీవాణి ట్రస్టు ద్వారా మరో నూతన విధానాన్ని అమలులోకి తీసుకువచ్చింది టీటీడీ. పదివేల రూపాయలు ఈ ట్రస్టుకి భక్తుడు చెల్లిస్తే…వారికి విఐపి బ్రేక్ దర్శనం ఒక్కసారి కల్పిస్తుంది టీటీడీ. ఇప్పటి వరకు వి.ఐ.పి బ్రేక్ దర్శనాలు సిఫార్సు లేఖలపై టీటీడీ కేటాయిస్తూ వస్తోంది. దీంతో బ్రేక్ దర్శనాల కోసం భక్తులు దళారీలను ఆశ్రయించేవారు. దళారీలు భక్తుల నుంచి అధిక మొత్తంలో డబ్బు వసూలు చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. స్పెషల్ ఆఫీసర్‌గా ధర్మారెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి టిక్కెట్ల కేటాయింపు నుంచి తనిఖీల వరకు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఫలితంగా దళారి వ్యవస్థకు దాదాపుగా చెక్ పడినట్లయింది. మరోవైపు విజిలెన్స్ తనిఖీల్లో అనేక మంది పి.ఆర్.ఓ ముసుగులో ఉన్న దళారీలను అదుపులోకి తీసుకుంటున్నారు.

Related posts