telugu navyamedia
news Telangana trending

శ్రీశైలం పూర్తిస్థాయిలో నీటిమట్టం … దిగువకు నీటి విడుదల …

srisailam is full capacity water released

జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుని నిండుకుండలా మారింది. కర్ణాటకలో వర్షాలు తగ్గిన తరువాత ఆల్మట్టి నుంచి నీటి విడుదలను నిలిపివేయగా, ప్రస్తుతం జూరాలకు 6,226 క్యూసెక్కుల వరద నీరు మాత్రమే వస్తోంది. జూరాల నుంచి 7,187 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. తుంగభద్ర జలాశయం నుంచి విడుదల అవుతున్న నీటితో కలిపి శ్రీశైలానికి 20 వేల క్యూసెక్కులకు పైగా నీరు వస్తుండగా, ఆ నీరు వివిధ కాలువలు, ఎత్తిపోతల పథకాలకు మాత్రం విడుదల చేస్తూ, జలాశయంలో నిండుగా నీరు ఉండేలా అధికారులు చూస్తున్నారు.

కల్వకుర్తి ఎత్తిపోతల పథకంతో పాటు, హంద్రీనీవా, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ల ద్వారా శ్రీశైలం నుంచి నీరు విడుదల అవుతోంది. విద్యుత్ ఉత్పత్తి ద్వారా 30 వేల క్యూసెక్కుల నీటిని సాగర్ జలాశయానికి అధికారులు విడుదల చేస్తున్నారు. మొత్తం మీద 12 వేల క్యూసెక్కుల నీటిని నికరంగా నిల్వ చేస్తున్నామని అధికారులు వెల్లడించారు.

Related posts

విశాఖ : … మెట్రో విస్తరణ … దశలవారీగా జరుగుతుంది…

vimala p

ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు మరోసారి పెంపు

vimala p

టెస్టుల్లోనూ .. జెర్సీలపై పేర్లు.. నెంబర్లు …

vimala p