telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు మూసివేత.. వెనుదిరుగుతున్న పర్యాటకులు

srisailam project with full of water

ప్రకృతి ఒడిలో అద్భుతమైన జలదృశ్యంతో అలరించిన శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను నిన్న సాయంత్రం అధికారులు మూసివేశారు. ఎగువ నుంచి వస్తున్న వరద 2 లక్షల క్యూసెక్కులకు లోపు చేరడంతో, విద్యుత్ ఉత్పత్తి, వివిధ కాలువలు, ఎత్తిపోతల పథకాలకు తోడు, ప్రాజెక్టులను పూర్తిగా నింపేందుకు మాత్రమే నీరు సరిపోతుందని భావించిన అధికారులు, రెండు ప్రాజెక్టుల క్రస్ట్ గేట్లనూ మూసివేశారు. దీంతో వందల అడుగుల ఎత్తు నుంచి నీరు కిందకు జాలువారే దృశ్యాలను తిలకించేందుకు వచ్చిన పర్యాటకులు అసంతృప్తితో వెనుదిరుగుతున్నారు.

శ్రీశైలం జలాశయం నుంచి కల్వకుర్తి ఎత్తిపోతల, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, హంద్రీనీవా కాలువలకు తోడు కుడి, ఎడమ గట్టు కాలువల ద్వారా విద్యుత్ ఉత్పత్తిని చేస్తూ, వచ్చిన నీటిలో కొంత మొత్తాన్ని విడుదల చేస్తున్నామని అధికారులు తెలిపారు. సాగర్ నుంచి విద్యుత్ ఉత్పత్తి ద్వారా పులిచింతలకు, లెఫ్ట్, రైట్ కెనాల్స్ ద్వారా వ్యవసాయానికి నీరు విడుదల అవుతోంది. ఇదే సమయంలో రెండు కెనాల్స్ ద్వారా పరీవాహక ప్రాంతాల్లోని అన్ని చెరువులనూ నింపాలని ఆదేశాలు ఇచ్చినట్టు నీటి పారుదల శాఖ అధికారులు వెల్లడించారు.

Related posts