telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“డబ్బిస్తే బిగ్ బాస్ హీరో… లేదంటే వెధవ” నాగార్జునపై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు

srireddy conter on dorasai movie to jivita

వ‌ర‌ల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం ప్ర‌స్తుతం తెలుగు సీజ‌న్-3… నాగార్జున హోస్ట్‌గా 15మంది సెల‌బ్రిటీల‌తో జూన్ 21న మొద‌లైన ఈ కార్య‌క్ర‌మం విజయవంతంగా వారం రోజులు పూర్తి చేసుకుంది. తొలి వారంలో హేమ ఎలిమినేట్ కాగా, రెండో వారంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ట్రాన్స్‌జెండ‌ర్ త‌మ‌న్నా సింహాద్రి ఇంట్లోకి ప్ర‌వేశించారు. ఆసక్తికర టాస్కులతో ఆసక్తికరంగా సాగుతోంది బిగ్ బాస్. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ షో వ్యాఖ్యాత, మన్మథుడు అక్కినేని నాగార్జునపై శ్రీరెడ్డి సంచలన కామెంట్ చేసింది. ”నాగార్జున గారికి తెలిసినన్ని పాలిటిక్స్ చంద్రబాబు గారికి కూడా తెలియవు. డబ్బిస్తే బిగ్ బాస్ హీరో… ఇవ్వకపోతే బిగ్ బాస్ ఒక వెధవ” అంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టారు.

నాగార్జున గతంలో ఏమన్నారంటే… బిగ్ బాస్ షోపై మీ అభిప్రాయం ఏమిటి అంటూ గతంలో ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ఎదురైన ప్రశ్నకు నాగార్జున స్పందించారు. బిగ్ బాస్ షో కాన్సెప్ట్ తనకు ఇష్టం వుండదన్నారు. పక్కింటివాడి జీవితంలోకి తొంగిచూడటం ఏం గేమ్ అన్నారు. అలాంటి వ్యక్తి అదే షోను హోస్ట్ చేయడం ఏమిటని శ్రీరెడ్డి ప్రశ్నించింది. అయితే ఈ ప్రశ్నకు షో ప్రారంభంలోనే మగార్జున సమాధానం ఇచ్చారు. “చల్లని గాలి, ఆకాశం, కొండలు ఇలా ప్రకృతి మధ్య బతకడం తనకు చాలా ఇష్టమని.. అలాంటి తాను బిగ్ బాస్ హౌస్‌లో వారు అన్ని రోజులు, అన్ని కెమెరాల మధ్య ఎలా బ్రతుకుతున్నారని చెప్పారు. ఇంకా తాను అలా వుండలేనని.. అందుకే ఆ షో అంటే ఇష్టం లేదు. కానీ మనసు కోతి లాంటిది, ఆ షో మీ అందరికీ ఎందుకు ఇష్టమో తెలుసుకోవాలని ఉంది. అందుకే ఈసారి రంగంలోకి తాను రంగంలోకి దిగుతున్నాను” అని నాగార్జున తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. బిగ్ బాస్ 3‌లో శ్రీరెడ్డికి చోటు దక్కుతుందని కూడా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.

Related posts