telugu navyamedia
సినిమా వార్తలు

శ్రీరెడ్డి జోస్యం… అతనే కాబోయే సీఎం

Srireddy

రెండు వారాల్లో ఏపీ ఎన్నికల ఫలితాలు విడుదల కాబోతున్నాయి. దీంతో ఏపీ రాజకీయ నాయకుల్లో టెన్షన్ నెలకొంది. తాజాగా శ్రీరెడ్డి ఎన్నికల ఫలితాలపై జోస్యం చెప్పింది. జగన్ ఫోటోని షేర్ చేస్తూ “మీరు రావాలి, అందరి లెక్కలు సరి చేయాలి. కావాలి జగన్… రావాలి జగన్.. ఎవ్వరి శత్రుశేషం ఉంచొద్దు” అంటూ కామెంట్స్ చేసింది. దీంతో జగన్ అభిమానులు శ్రీరెడ్డి ఫోటోను షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. గతంలో కూడా శ్రీరెడ్డి జగన్ కి అనుకూలంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది. రాష్ట్రానికి కొత్త నాయకుడు వస్తే ఉపయోగం ఉంటుందని, అందుకే చాలా మంది జగన్ వైపు మొగ్గు చూపుతున్నారని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. చంద్రబాబు పాలనలో చాలా మంది విసిగిపోయి ఉన్నారని, తెలుగుదేశం పార్టీలోని కొంతమంది ఎమ్మెల్యేలు చేసిన పొరపాట్లు జగన్ కి కలిసి వస్తున్నాయని, పాదయాత్రతో జగన్ కి చాలా మంది జనం దగ్గరయ్యారని, ఇవన్నీ చూసుకుంటే వైఎస్సార్ సీపీ అధికారంలోకి రావడానికి 60 శాతం అవకాశం ఉండగా.. టీడీపీకి 40 శాతం అవకాశాలు ఉన్నాయంటూ జోస్యం చెప్పుకొచ్చింది. శ్రీరెడ్డి చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

Related posts