telugu navyamedia
సినిమా వార్తలు

తాజ్ బంజారాలో ఇల్లీ అక్కతో… దర్శకుడు తేజపై శ్రీరెడ్డి ఆరోపణలు

Teja-and-Srireddy

టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ ఉదంతంతో ఇండస్ట్రీలో తీవ్ర దుమారం సృష్టించిన శ్రీరెడ్డి తాజాగా దర్శకుడు తేజని టార్గెట్ చేసింది. తన సోషల్ మీడియా అకౌంట్ లో తేజపై సంచలన ఆరోపణలు చేసింది. “రేపు తేజ రాసలీలల వినోదం… తాజ్ బంజారాలో ఇల్లీ అక్కతో ఏంటి మరి… మర్చిపోయావా…?” అంటూ పోస్ట్ పెట్టింది. ఇప్పుడు శ్రీరెడ్డిని తేజను టార్గెట్ చేయడానికి కారణం… ఇటీవల “సీత” సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తేజ టాలీవుడ్ కాస్టింగ్ కౌచ్ ఉదంతంపై మాట్లాడుతూ “అప్పట్లో ఆమె (శ్రీరెడ్డి) ఏదో చూసిందని ఇండస్ట్రీ పరువును రోడ్డుకి లాగేసిందని మీడియా వాళ్లు అన్నారు తప్పిదే ఇండస్ట్రీ పరువు ఏం కాలేదని అన్నారు. ఇండస్ట్రీ అంటే తమాషాగా ఉందా..? ఎవరో నలుగురైదుగురు కలిసి ఇండస్ట్రీని రోడ్డుకి లాగేస్తామంటే ఇక్కడ గాజులు తొడుక్కొని ఉన్నామా..? అంటూ ఘాటుగా స్పందించారు. దీంతో ఇలా తేజకి కౌంటర్ ఇచ్చిన శ్రీరెడ్డి తేజ రాసలీలల్ని బయటపెడతా అంటూ ఇలియానాను సైతం వివాదంలోకి లాగింది. అయితే ఇప్పటివరకు ఆమె తేజ, ఇలియానాలకు సంబంధించి ఎలాంటి వీడియోలు షేర్ చేయలేదు.

Related posts