telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

శ్రీనగర్ నిట్ విద్యార్థులను తీసుకువచ్చేందుకు సర్కార్ చర్యలు

ktr trs

జమ్ము కశ్మీర్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా అమర్ నాథ్ యాత్రికులతో పాటు శ్రీనగర్ ఎన్‌ఐటీ క్యాంపస్‌ను విద్యార్థులు వెంటనే ఖాళీ చేసి వెళ్లిపోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. రాష్ట్రానికి రావడానికి సహాయం చేయాల్సిందిగా శ్రీనగర్ నిట్ క్యాంపస్‌లో చదువుతున్న విద్యార్థులు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కోరారు.

ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కేటీఆర్ స్పందించారు. మీరంతా జాగ్రత్తగా రాష్ట్రానికి తిరిగివచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కేటీఆర్ ట్వీట్ చేశారు. కేటీఆర్ సూచన మేరకు విద్యార్థులను తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. శ్రీనగర్‌లోని నిట్‌లో 130 మంది తెలుగు విద్యార్థులు చదువుతున్నారు. విద్యార్థులను రాష్ట్రానికి తీసుకువచ్చే ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఎస్కే జోషి ఢిల్లీ తెలంగాణ భవన్ అధికారులను ఆదేశించారు.

Related posts