telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

శ్రీముఖికి భారీ ఆఫర్… అందుకే పటాస్ నుండి శ్రీముఖి అవుట్..

srimukhi out from patas for anther show

పటాస్ తో బుల్లితెరకి మరింత గ్లామర్ తీసుకొచ్చిన యాంకర్స్ శ్రీముఖి, ఆ షో కు దూరం అవుతుందనే వార్తలు వస్తున్నాయి. ప్రేక్షకులకు బుల్లితెరపై ఆమె చేసే అల్లరి యూత్ కి విపరీతంగా నచ్చేసింది. నాన్ స్టాప్ గా సందడి చేస్తూ ‘పటాస్’ షోను ఒక రేంజ్ కి తీసుకెళ్లింది. శ్రీముఖి కోసమే ఈ షో చూసేవాళ్లు వున్నారనడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. అలాంటి శ్రీముఖి ఈ షో నుంచి కొంతకాలం పాటు బ్రేక్ తీసుకుంటున్నట్టుగా చెప్పడం యూత్ ను నిరాశ పరిచింది.

శ్రీముఖి హఠాత్తుగా ఈ షో నుండి బ్రేక్ తీసుకోడానికి కారణం ఏమై ఉంటుందా అని తీవ్రంగా ఆలోచిస్తున్నారు అభిమానులు. తీరా చూస్తే, ‘బిగ్ బాస్ 3’ సీజన్ లో పాల్గొనే అవకాశం శ్రీముఖికి వచ్చిందట. ఆ షోలో పాల్గొనడం కోసమే ఆమె బ్రేక్ తీసుకుందనేది తాజా సమాచారం. నాగార్జున హోస్ట్ గా వ్యవహరించనున్న ఈ షో, జూలై రెండవ వారంలో ప్రారంభం కానుందని సమాచారం. శ్రీముఖి అల్లరి బిగ్ బాస్ హౌస్ లో.. అన్నమాట!

Related posts