telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

ప్రపంచ కప్ : .. 203 పరుగులే చేసిన లంక… దక్షిణాఫ్రికా గెలిచినా..!

srilanka scored 203 on westindies

ఈ ప్రపంచ కప్ లో శ్రీలంక పేలవంగానే ఆడిందంటే అతిశయోక్తి ఏమిలేదు. నేది మ్యాచ్ లో కూడా అలాంటి ప్రదర్శనే చేసింది లంక. బ్యాట్స్‌మెన్ వైఫల్యంతో సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో ఆ జట్టు విలవిలలాడింది. సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారిన సమయంలో పట్టుదలతో రాణించాల్సింది పోయి చేతులెత్తేశారు. కనీసం 250 మార్క్ కూడా అందుకోలేకపోయారు. కుశాల్ పెరీరా(30), ఆవిష్క ఫెర్నాండో(30) మాత్రమే టాప్‌స్కోర్ చేశారు. ప్రిటోరియస్(3/25), క్రిస్‌మోరీస్(3/46), రబాడ(2/36) ధాటికి లంక 49.3 ఓవర్లలో 203 పరుగులకే ఆలౌటైంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లంకకు తొలి ఓవర్‌లోనే ఊహించని షాక్. సఫారీ బౌలర్ రబాడ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్ తొలి బంతికే దిముత్ కరుణరత్నె డకౌట్‌గా వెనుదిరిగాడు.

రబాడ వేసిన పదునైన బంతిని షాట్ ఆడేందుకు ప్రయత్నించగా బంతి బ్యాట్స్‌మన్ గ్లోవ్స్‌కు తాకి సెకండ్ స్లిప్‌లో ఉన్న డుప్లెసిస్ చేతికి చిక్కాడు. ఆ తర్వాత కుశాల్ పెరీరా, ఫెర్నాండో ఆదుకునే ప్రయత్నం చేశారు. 50కి పైగా పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి ఆకట్టుకున్నారు. ఈ ఇద్దరిని ప్రిటోరియస్ స్వల్ప విరామాల్లో పెవిలియన్ పంపి ఒత్తిడిలో పడేశాడు. ఆ తర్వాత వరుస విరామాల్లో వికెట్లు చేజార్చుకుని పెవిలియన్ బాట పట్టారు. కుశాల్ మెండీస్(23), మాథ్యూస్(11), ధనంజయ డిసిల్వా(24), జీవన్ మెండీస్(18), తిసార పెరీరా(21) ఘోరం విఫలమయ్యారు. ఏ ఒక్క బ్యాట్స్‌మెన్ కూడా నిలదొక్కుకున్ని ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టే ప్రయత్నమే చేయలేదు. ఓవైపు సఫారీ బౌలర్లు బుల్లెట్ లాంటి బంతులతో విరుచుకుపడుతుంటే లంక దగ్గర సమాధానమే లేకుండాపోయింది.

Related posts