telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కొలంబోలో బాంబు పేలుళ్లపై స్పందించిన కేసీఆర్

Woman candidates kcr cabinet Telangana

శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన వరుస పేలుళ్ళపై తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించారు. ఈ దాడులను ఖండిస్తున్నామని అన్నారు. ఉగ్రవాదుల చర్య అత్యంత హేయమైందిగా అభివర్ణించారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని తెలిపారు. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు.

ఆదివారం ఉదయం మూడు చర్చిలు, మూడు హోటళ్ళలో బాంబు పేలుళ్ళు సంభవించాయి. అనంతరం మధ్యాహ్నం 2 గంటల సమయంలో మరో రెండు పేలుళ్ళు జరిగాయి. మొత్తం మీద 250 మంది ప్రాణాలు కోల్పోగా, 300 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో 35 మంది విదేశీయులు ఉన్నారు.ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి కర్ఫ్యూ విధిస్తున్నట్లు శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది.

Related posts