telugu navyamedia
ట్రెండింగ్ సామాజిక

శ్రీకృష్ణదేవరాయల..శ్రీవారి సందర్శన..506 ఏళ్ళ క్రితం..

srikrishnadevarayala tirumala darsan
506 సంవత్సరాల క్రితం సరిగ్గా ఈరోజు రాయలు శ్రీవారిని సందర్శించారు. శ్రీకృష్ణదేవరాయలు సరిగ్గా 506 సంవత్సరాల క్రితం ఈరోజు తిరుమల శ్రీవారిని సందర్శించాడు. 1509లో కృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యానికి చక్రవర్తి అయ్యాడు. 
విజయనగర సామ్రాజ్యాన్ని తుంగభద్ర నది ఒడ్డున  1336 హరిహర రాయలు, బుక్కరాయలు అనే సోదరులు స్థాపించారు, వారిది సంగమ వంశం, ఆ తరువాత సాళువ  వంశం వారు పాలన చేశారు. 1503లో విజయనగరం తుళువ వంశం పాలన క్రిందకు వచ్చింది . కృష్ణదేవరాయలు అన్న వీర నరసింహరాయలు 1503లో రాజు అయ్యాడు.
srikrishnadevarayala tirumala darsan
1509లో వీర నరసింహరాయలు చనిపోవడంతో కృష్ణదేవరాయలు సింహాసనం అధిష్టించాడు. 1510 లో తన ఇద్దరు రాణులు తిరుమదేవి, చిన్నాదేవితో పట్టాభిషేక మహోత్సవం జరుపుకున్నాడు. జైత్ర యాత్ర అనంతరం రాయలు తన దేవేరులు తిరుమలాదేవి , చిన్నాదేవితో కలసి తిరుమల వచ్చాడు. 
శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే కృష్ణదేవరాయలు అమితమైన భక్తి. రాయలవారి ఇష్ట  దైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి. 1513 ఫిబ్రవరి 10వ తేదీన అంటే 506 సంవత్సరాల క్రితం విజయనగర రాజ్య మహా రాజుగా తిరుమల శ్రీవారిని సందర్శించాడు. ఆ రోజు ఉదయం సుప్రభాత వేల రాయలు స్వామి వారిని సందర్శించి మొక్కులు చెల్లించుకున్నాడు.
కృష్ణదేవరాయల సందర్శన ఓ చరిత్రాత్మకం , రాయలు  శ్రీవారికి వర్ణ ఖచిత స్వర్ణాభరణః కిరీటాన్ని బహూకరించాడు. 
ఇది మణులు, మాణిక్యాలు, కెంపులు, పగడాలు, రత్నాలతో అద్భుతంగా చేసిన కిరీటం, దీని వేల కట్టలేనిది. తిరుమలాదేవి, చిన్నాదేవి కూడా శ్రీవారికి విలువైన కానుకలు సమర్పిచారు.
srikrishnadevarayala tirumala darsan
కృష్ణదేవరాల సందర్శన తిరుమలలో ఓ నూతన చరిత్రకు నాంది పలికింది. తిరుమలలో  విమాన గోపురానికి కృష్ణదేవరాయలే  బంగారు పూత పూయించినట్టు చాలా మందికి తెలియదు. శ్రీవారి ఆలయ అభివృద్ధిలో రాయల పాత్ర ఎంతో వుంది.
కృష్ణ దేవరాయలు వైష్ణవ మతాభిమాని, శ్రీవారు వారి కుటుంబ ఆరాధ్య దైవం. అందుకే ఏ రాజు చేయనంత అభివృద్ధి రాయలు చేశాడు. కృష్ణదేవరాయలు వెంకటేశ్వర స్వామికి మధ్యన వున్న అనుబంధాన్ని తార్కాణం తిరుమలలో వున్న దేవేరులతో రాయలు వున్న కంచు విగ్రహాలు.

Related posts