telugu navyamedia
సినిమా వార్తలు

సందడిగా ‘పెళ్లి సందD’ టీజర్ రిలీజ్‌..!

నటుడు శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ హీరోగా నటిస్తోన్న చిత్రం ‘పెళ్లి సందD’. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో గౌరి రోణంకి దర్శకత్వం వహిస్తున్నారు. హీరో శ్రీకాంత్, దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావుల కెరీర్లో ‘పెళ్లిసందడి’ ఎంత‌ పెద్ద హిట్ అయ్యిందో అంద‌రికి తెలిసిందే.

New 'Pelli SandaD' song to be unveiled on THIS day

ఇంకో విశేషం ఏంటంటే.. నటుడు గాను ఓ కీలక పాత్రలో రాఘవేంద్రరావు కనిపించనున్నారు. రోషన్ కు జంటగా శ్రీలీల హీరోయిన్ గా నటించింది. ఇటీవ‌ల రిలీజ్ చేసిన ‘ప్రేమంటే ఏంటి’, ‘బుజ్జులు బుజ్జులు’ అలాగే ‘పెళ్లిసందD’ టైటిల్ సాంగ్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా టీజర్‌ ను అక్కినేని నాగార్జున విడుదల చేశారు. . ‘సహస్రకు పెళ్లి నాతోనా.. లేక నువ్వు తెచ్చిన తొట్టిగ్యాంగ్ లీడర్‌తోనా’ అంటూ రోషన్ చెప్పిన డైలాగ్‌ హైలెట్‌గా నిలిచింది.

Preamante Enti song from Roshan and Sri Leela starrer Pelli SandaD released  | Telugu Movie News - Times of India

అలాగే టీజర్ చాలాబాగుందంటూ మూవీ టీంకి నాగార్జున‌ విషెస్ తెలియజేశారు. రోషన్ యాక్షన్ సీన్స్‌లో ఆకట్టుకున్నాడు. శ్రీలీలను గ్లామరస్‌గా చూపించారు. విజువల్స్, హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ, స్వరవాణి కీరవాణి బ్యాగ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. త్వరలో ‘పెళ్లిసందD’ ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్‌.

Bujjulu Bujjulu song from 'Pelli SandaD': Romantic mass beat!

Related posts