ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం శ్రీకాకుళం జిల్లాలోని జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోంపేట, పలాస, కాశీబుగ్గ, టెక్కలి, పాతపట్నం ప్రాంతాల్లో పవన్ కల్యాణ్ పర్యటించాల్సి ఉంది. అదే రోజు తెలుగుదేశం పార్టీ అధినేత ఏపీ సీఏం చంద్రబాబు కూడా శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న నేపథ్యంలో పవన్ తన పర్యటనను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది.
చంద్రబాబు ఇచ్చాపురం, నరసన్నపేట, రాజాం, ఎచ్చెర్ల, శ్రీకాకుళం శాసనసభ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. చంద్రబాబు శ్రీకాకుళం పర్యటన ఉన్న నేపథ్యంలో పోలీసులు పవన్ కల్యాణ్ హెలికాప్టర్ కు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అదే సమయంలో రోడ్డు మార్గాన ప్రయాణించడానికి కూడా అనుమతి ఇవ్వలేదు. దీంతో ఆయన తన పర్యటనను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది.