telugu navyamedia
andhra crime news

ప్రైవేటు బస్సు బోల్తా.. 33 మందికి గాయాలు

Accident

శ్రీకాకుళంలో జిల్లాలో వలస కూలీలతో వెళుతున్న ప్రైవేటు బస్సు బాలిగాం వద్ద బోల్తా పడింది. ఈ ఘటనలో 33 మంది గాయపడ్డారు. పశ్చిమబెంగాల్‌కు చెందిన వలసకూలీలు కర్ణాటకలో క్వారంటైన్‌ ముగించుకుని తమ స్వస్థలాలకు వెళ్తున్నారు.

బెంగళూరు నుంచి కోల్‌కతా వెళ్తున్న బస్సు బాలిగాం వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారికి పలాస ప్రభుత్వ దవాఖానలో చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 42 మంది ఉన్నారు.

Related posts

హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు

vimala p

సీఎంను పొగిడినందుకు సినీ నటుడికి చేదు అనుభవం

vimala p

హైదరాబాద్ : … 75చలానాలు.. 75వేల జరిమానా … ఒక వాహనమే..

vimala p