telugu navyamedia
సాంకేతిక

పీఎస్‌ఎల్‌వీ-సీ53 రాకెట్‌ ప్రయోగం విజయవంతం..

*పీఎస్ ఎల్వీ సి-53 ర్యాకెట్ ప్రయోగం విజ‌యవంతం
*సింగపూర్‌కు చెందిన మూడు ఉపగ్ర‌హాల‌ను క‌క్ష్య‌లోకి చేరిన శాటిలైట్స్‌

పీఎస్ఎల్వీ- సి 53 ర్యాకెట్ ప్రయోగం విజయవంతంగా ముగిసింది. శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి సెకండ్ లాంచ్ పాడ్ నుంచి ఈ ప్రయోగం జరిగింది. పీఎస్ఎల్వీ- సి 53 నింగిలోకి దూసుకెళ్లింది.

ఈ ప్రయోగం ద్వారా సింగపూర్ కు చెందిన డీఎస్‌–ఈఓ అనే 365 కేజీల ఉపగ్రహం, 155 కేజీల న్యూసార్, 2.8 కేజీల స్కూబ్‌–1 ఉపగ్రహాలను ప్రయోగించనున్నారు. పీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో ఇది 55వ ప్రయోగం.

మూడు ఉపగ్రహాలు సక్సెస్‌ఫుల్ గా అంతరిక్షంలోకి ప్రవేశించాయి. రాకెట్ నుంచి విజయవంతంగా మూడు ఉపగ్రహలు విడిపోయాయి. ఉత్కంఠ భరితంగా సాగిన పీఎస్ఎల్వీ ప్రయాణం విజయవంతంగా ముగియడంతో ఇస్రో శాస్త్రవేత్తలు సంబరాలు జరుపుకున్నారు.

Related posts