telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

భద్రాచలంలో కన్నుల పండువగా సీతారాముల కళ్యాణం

Sri Seetharamula Kalyanam Bhadrachalam

శాస్త్రోప్తవేతంగా వేదమంత్రోచ్ఛారణల మధ్య భద్రాచలంలో శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవం కన్నుల పండువగా జరుగుతోంది. సీతారాముల కళ్యాణం వీక్షించేందుకు భారీగా భక్తులు తరలి వచ్చారు. దీంతో భద్రాద్రి పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం తరుపున సీతారాములకు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సమర్పించారు.

భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కల్యాణానికి మిథిలా స్టేడియం ప్రాంగణం ముస్తాబైంది. భక్తుల కోసం అధికారులు 3 లక్షల లడ్డూలను సిద్ధం చేశారు. 34 ప్రత్యేక కౌంటర్లలో రాముల వారి తలంబ్రాల పంపిణీకి ఏర్పాట్లు చేశారు. సీతాదేవికి యోత్రబంధనం, శ్రీరాముడికి యజ్ఞోపవీతధారణను అర్చకులు చేశారు. ఈ కమనీయ వేడుకను తిలకించేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, తమిళనాడుతో పాటు దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు.

Related posts