telugu navyamedia
telugu cinema news trending

వైరల్ వీడియో : నాగబాబుపై శ్రీరెడ్డి సెటైర్స్

Srireddy-and-nagababu

ఇటీవల కాలంలో నందమూరి బాలకృష్ణను టార్గెట్ చేస్తూ మెగా బ్రదర్ నాగబాబు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు బాలకృష్ణ కామెంట్స్ కు కౌంటర్ అంటూ వరుసగా వీడియోలను విడుదల చేసి టాలీవుడ్ లో సంచలనం సృష్టిస్తున్నారు. మరోవైపు శ్రీరెడ్డి ఈ వివాదానికి సంబంధించిన ఓ కామెడీ వీడియోను విడుదల చేసింది. అందులో నాగబాబుపై సెటైర్స్ వేసింది. “జబర్దస్త్ కామెడీ షో జడ్జి పాపం బాలయ్య బాబు ఫ్యాన్స్ చేతిలో పడితే సీన్ ఇలా ఉంటూనే” అంటూ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ వీడియోలో నాగబాబు ఒళ్లంతా గాయాలతో కట్లు కట్టుకొని ఉన్నారు. ఆయనను పరామర్శించడానికి వచ్చిన వారిని నన్ను ఎవరు కొట్టారని నాగబాబు ప్రశ్నించగా… వారు బాలయ్య ఫ్యాన్స్ కొట్టారని చెబుతారు. ఎందుకు, ఎలా కొట్టారని నాగబాబు అడగ్గా… సోషల్ మీడియాలో బాలయ్య బాబుపై రాసినందుకే అని వాళ్ళు చెబుతారు. చివరకు జై బాలయ్య అంటే వదిలేశారని చెబుతారు. మరో బ్యాచ్ వస్తుందని… జై బాలయ్య అని అరవాలని సూచిస్తారు. జై బాలయ్య జైజై బాలయ్య అనే నినాదాలతో వీడియో ముగించారు. ఈ వీడియో చూసిన మెగా ఫాన్స్ శ్రీరెడ్డిపై ఓ రేంజ్ లో మండిపడుతున్నారు.


Related posts

వివేకా హత్య కేసు : మాకేమి సంబంధం లేదంటున్న.. పరమేశ్వరరెడ్డి !

vimala p

శిల్పి…

vimala p

అవిసెగింజలతో.. అధికబరువుకు చెక్..

vimala p