telugu navyamedia
telugu cinema news trending

సన్ రైజర్స్ కు సపోర్ట్ గా వెంకటేష్ ఓ ట్వీట్ వైరల్

Venkatesh

ఐపీఎల్ మేనియా మొదలైపోయింది. ఈ రోజు సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో తన మొదటి మ్యాచ్ ని ఆడబోతుంది. ఇటు జట్లు కూడా మంచి బ్యాటింగ్ లైనప్, బలమైన బౌలర్లతో సమానంగా ఉన్నాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. భారత కాలమాన ప్రకారం ఈ మ్యాచ్ 07:30కి మొదలుకానుంది. సెలెబ్రిటీలతో పాటు సామాన్యులు కూడా ఐపీఎల్ కోసం ఎంతగానో ఎదురు చూశారు. ఇక టాలీవుడ్ స్టార్ విక్టరీ వెంకటేష్ కు కూడా క్రికెట్ కు వీరాభిమాని అన్న విషయం తెలిసిందే. ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ జరుగుతుందంటే వెంకటేష్ కచ్చితంగా స్టేడియంకు వెళ్లి, అక్కడ ఈలలు వేస్తూ హైదరాబాదు టీంకి సపోర్ట్ ఇస్తూ సందడి చేస్తుంటాడు. అయితే ఇప్పుడు కరోనా నేపథ్యంలో ఐపీఎల్ దుబాయ్‌లో జరుగుతుండగా వెంకీ అక్కడికి వెళ్ళలేని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో సన్ రైజర్స్ టీంను సపోర్ట్ చేస్తూ వెంకటేష్ ఓ ట్వీట్ చేశాడు. ‘ఆల్‌ దిబెస్ట్ SRH… నేను మిమ్మల్ని ఇంట్లోనే ఉండి ఉత్సాహపరుస్తాను’ అని వెంకీ పోస్ట్ చేశాడు. అయితే వెంకీ ట్వీట్ కి సన్ రైజర్స్ హైదరాబాద్ స్పందిస్తూ.. ‘స్టేడియం స్టాండ్స్ నుంచి మీ సపోర్టును మిస్ అవుతాం’ అంటూ రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అయింది. ఇక ఇప్పటికి సన్ రైజర్స్ హైదరాబాద్ రెండు సార్లు చాంఫియ‌న్‌గా నిలవగా, 2009, 2016 లో ఫైనల్‌కు చేరి రన్నరప్ తో సరిపెట్టుకున్న విషయం విదితమే.

Related posts

దలైలామా హత్యకు .. ఉగ్రకుట్ర ..

vimala p

మహేష్ బాబుకు అదిరిపోయే బర్త్ డే గిఫ్ట్… 60.2 మిలియ‌న్ ట్వీట్స్

vimala p

“అరుంధతి” హిందీ రీమేక్ లో కరీనా ?

vimala p