telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

శ్రీముఖి కొత్త షో… బతుకు బలైపోయిన బండి…

Srimukhi

లాక్‌డౌన్ ప్రభావంతో ఇంట్లోనే ఉంటున్న ప్రజలకు కాస్త వినోదాన్ని అందించేందుకు ఒక వీడియో రూపొందించింది శ్రీముఖి. శ్రీముఖి హోస్ట్‌గా జబర్దస్త్ అవినాష్, యాంకర్ విష్ణు ప్రియ భార్యభర్తలుగా కనిపించారు. కామెడీని అందిస్తూనే భార్యభర్తలిద్దరు కలిసి పనులు పంచుకుంటే ఎలాంటి గొడవలు రావని సందేశం ఇచ్చారు. హైలైట్ ఏంటంటే.. ఈ వీడియోను శ్రీముఖి, విష్ణు ప్రియ, అవినాష్ ఎవరి ఇళ్లలో వాళ్లు ఉండి షూట్ చేశారు. ఆ వీడియోను శ్రీముఖి తన యూట్యూబ్ ద్వారా పోస్ట్ చేసింది. భార్యాభర్తలు గొడవ పెట్టుకొని విడిపోతే వాళ్లను కలిపే టీవీ షోలు చాలానే ఉన్నాయి. ప్రముఖ హీరోయిన్ల హోస్టింగ్‌తో ఇలాంటి షోలకు మంచి రేటింగ్ కూడా దక్కుతుంది. అయితే, తానేమీ తక్కువ కాదంటోంది యాంకర్ శ్రీముఖి.

Related posts