telugu navyamedia
సినిమా వార్తలు

నాకు మందు అలవాటు ఉంది… కానీ… : శ్రీముఖి

Srimukhi

బుల్లితెరపై తనదైన శైలిలో నవ్వులు పండిస్తూ దూసుకెళ్తున్న యాంకర్స్ లో శ్రీముఖి ఒకరు. “పటాస్” షోతో శ్రీముఖి మంచి గుర్తింపు సంపాదించుకుంది. శ్రీముఖి హీరోయిన్ గా పలు చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. శ్రీముఖి ఇటీవల సోషల్ మీడియాలో అభిమానులతో చిట్ చాట్ చేసింది. అందులో భాగంగా అభిమానులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. ఎలాంటి పాత్రలో నటించాలని ఉంది ? అనే ప్రశ్నకు శ్రీముఖి “నేను రియల్ లైఫ్ లో చాలా మంచిదాన్ని. కాబట్టి సినిమాల్లో విలన్ రోల్స్ చేయాలని అనుకుంటున్నా. అలా అయినా నాలో విలనిజాన్ని ప్రదర్శించే అవకాశం ఉంటుంది. విలన్ పాత్రల్లోనే నటనకు ఎక్కువగా అవకాశం ఉంటుంది” అని శ్రీముఖి తెలిపింది.

మరో నెటిజన్ “మీకు మందు అలవాటు ఉందా?” అని సరదాగా అడగ్గా… స్పందించిన శ్రీముఖి ఎలాంటి మొహమాటం లేకుండా “నిజాయతీగా చెబుతున్నా.. నాకు మందు అలవాటు ఉంది. కానీ అప్పుడప్పుడు మాత్రమే. అది కూడా వైన్ మాత్రమే తాగుతాను. వైన్ ఆరోగ్యానికి మంచిది కూడా” అంటూ శ్రీముఖి సమాధానం ఇచ్చింది. ఇక ప్రదీప్ చాలా టాలెంటెడ్ పర్సన్ అని,. హైపర్ ఆది అమేజింగ్ రైటర్, రష్మీ చాలా డేరింగ్ అంటూ శ్రీముఖి చెప్పుకొచ్చింది శ్రీరెడ్డి.

Related posts